నలభై ఏళ్లు దగ్గరపడుతున్న చెక్కు చెదరని అందంతో మాయ చేస్తోంది అందాల నటి త్రిష. ఒకవైపు పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూనే, మరోవైపు కుర్ర హీరోల పక్కన సైతం నటిస్తోంది. త్రిషకు తమిళ్ లోనే కాకుండా టాలీవుడ్ ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడు వయసు పెరుగుతున్నా.. స్వీట్ సీక్స్ టీన్ లాగా అభిమానులను ఆకట్టుకుంటోంది. నిన్న హైదరాబాదులో జరిగిన ‘పొన్నియిన్ సెల్వన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై తెలుగు ప్రేక్షకులు చూశారు. బ్లాక్ కలర్ శారీలో ఆమె నల్ల గులాబీలా మెరిసిపోయింది.
నిజం చెప్పాలంటే ఆమె మునుపటి కంటే గ్లామరస్ గా తయారైంది. ఒక వైపున రెడ్ కలర్ డ్రెస్ లో ఐశ్వర్య రాయ్ తళుక్కుమంటున్నా, త్రిషనే అందరినీ ఆకర్షించింది. చూసిన వాళ్లంతా త్రిష మరింత అందంగా తయారైందనే చెప్పుకుంటున్నారు. స్టేజ్ పైన దిల్ రాజు కూడా అదే మాట అన్నారు. చూస్తుంటే ఈ సినిమా తరువాత సీనియర్ స్టార్ హీరోల సరసన తెలుగులో త్రిష బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఆమె పోషించిన ‘కుందవై’ పాత్ర హైలైట్ గా నిలవనుందని అంటున్నారు. ఈ నెల 30వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.