Site icon HashtagU Telugu

Mohini Dey : ఏఆర్ రెహమాన్ నాకు తండ్రి లాంటివారు : మోహిని దే.. ఈమె ఎవరు ?

Mohini Dey Ar Rahman Saira Banu

Mohini Dey : ప్రముఖ సంగీతకారుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరాబాను నుంచి విడిపోతున్నట్లు నవంబర్ 19న ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ఈ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ టీమ్‌లోని మోహిని దే  కూడా తన భర్త మార్క్ హార్ట్సుచ్ నుంచి విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. దీంతో ఏఆర్ రెహమాన్, మోహిని దే  గురించి పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి. అప్పట్లోనే ఈ పుకార్లను తీవ్రంగా ఖండించిన మోహిని.. ఇప్పుడు మరోసారి అదే అంశంపై మాట్లాడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘ పుకార్లను ఎవరూ నమ్మొద్దు. ఏఆర్ రెహమాన్ నాకు తండ్రి లాంటి వారు. నేను ఐదేళ్ల క్రితమే ఇండియా నుంచి అమెరికాకు వెళ్లిపోయాను. అంతకుముందు దాదాపు ఎనిమిదిన్నర ఏళ్ల పాటు ఏఆర్ రెహమాన్‌ మ్యూజిక్ టీమ్‌లో బాసిస్ట్‌గా(Mohini Dey) పనిచేశాను. నేను అమెరికాలోని అనేక మంది పాప్ కళాకారులతోనూ కలిసి పని చేస్తుంటాను. ఏఆర్ రెహమాన్, సైరాబానుల వ్యక్తిగత విషయాల్లోకి నన్ను లాగొద్దు. ఎవరూ ఆ విషయంలో జోక్యం చేసుకోవద్దు. అది వారి కుటుంబం విషయం. ఆ దంపతుల ప్రైవసీని గౌరవించాలి’’ అని మోహిని దే కోరారు.

Also Read :Salicylic Acid : ఇంట్లో సాలిసిలిక్ యాసిడ్ స్కిన్ క్లెన్సర్‌ను ఎలా తయారు చేయాలి..?

‘‘ఇటీవలే నేను ఒక టూర్‌కు వెళ్లాను. అది పూర్తయి ఇప్పుడు తీరిక దొరికింది. అందుకే మీకు అన్ని వివరాలు చెబుతున్నాను. రెహమాన్ నాకు తండ్రి లాంటి వారు. రెహమాన్ కూతురు, నేను ఒకే వయసు వాళ్లం. మా గురించి తప్పుగా ఆలోచిస్తున్న వారి మానసిక స్థితిని తలచుకుంటే చాలా బాధేస్తోంది. ఇతరుల కుటుంబానికి సంబంధించిన భావోద్వేగ అంశాలపై మనకు గౌరవం, సానుభూతి ఉండాలి కదా ?’’ అని మోహిని దే తెలిపారు. ‘‘నాకు జీవితంలో రోల్ మోడల్స్, తండ్రిలాంటి వారు కొందరే ఉన్నారు. వారిలో ఏఆర్ రెహమాన్ ఒకరు. మా నాన్నే నాకు తొలుత మ్యూజిక్ నేర్పారు. ఆయన  ఏడాది క్రితమే చనిపోయారు. మ్యూజిక్ ఇండస్ట్రీలో నాకు తండ్రిలా అవకాశాలు ఇచ్చిన మహా మనిషి ఏఆర్ రెహమాన్’’ అని ఆమె చెప్పుకొచ్చారు.  ఇకనైనా తప్పుడు ప్రచారాలను, పుకార్ల వ్యాప్తిని ఆపాలని నెటిజన్లను మోహిని కోరారు.

మోహిని దే ఎవరు ?