Barrelakka: కాబోయే భర్తను పరిచయం చేసిన బర్రెలక్క.. నెట్టింట ఫోటోస్ వైరల్!

  • Written By:
  • Updated On - March 25, 2024 / 12:34 PM IST

తెలుగు ప్రేక్షకులకు బర్రెలక్క అలియాస్ శిరీష గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొన్నటి వరకు సోషల్ మీడియాలో ఈమె పేరు మారుమోగిపోయింది. డిగ్రీ చదివినా ఉద్యోగాలు వస్తాలేవు.. అందుకే బర్రెలు కాస్తున్నా అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. దీంతో నెట్టింట ఆమె షేర్ చేసిన వీడియో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసింది. ఆమెకు యువత, స్టార్స్, ప్రముఖులు సపోర్ట్ చేశారు. కానీ ఆశించిన స్థాయిలో ఓట్లు మాత్రం రాబట్టలేకపోయింది.

ఎలక్షన్స్ తర్వాత కొన్నాళ్ల పాటు సైలెంట్ అయిన బర్రెలక్క పేరు ప్రస్తుతం ఇప్పుడు మరోసారి వైరల్ గా మారింది. త్వరలోనే ఆమె పెళ్లి పీటలలెక్కనుంది. బర్రెలక్క అసలు పేరు కర్నె శీరిష. తెలంగాణం లోని పెద్ద కొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసింది. తన ఇన్ స్టాలో నిశ్చితార్థం వీడియో షేర్ చేసి పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. సడెన్ గా పెట్టుకోవడం వల్ల అందరిని పిలవలేకపోయానని చెప్పుకొచ్చింది. దీంతో బర్రెలక్క పెళ్లి ఎప్పుడు ? ఆమెకు కాబోయే భర్త ఎవరు ? అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు రావడంతో తాజాగా ఆమె పెళ్లి తేదీతో పాటు కాబోయే భర్తను కూడా తన ఫాలోవర్లకు పరిచయం చేసింది.

 

అలాగే పెళ్లికి ముందు జరిగిన ప్రీ వెడ్డింగ్ సాంగ్ వీడియోను షేర్ చేస్తూ తన భర్త ఇన్ స్టా ఐడికి ట్యాగ్ చేసింది. బర్రెలక్కకు కాబోయే భర్త పేరు వెంకటేశ్ అతడి ఇన్ స్టా ఐడిలో ఎంఎస్సీ ఫిజిక్స్ మినహా మరే వివరాలు కనిపించలేదు. ప్రస్తుతం బర్రెలక్క ప్రీ వెడ్డింగ్ సాంగ్ వీడియో నెట్టింట వైరలవుతుండగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్. బర్రెలక్క తల్లి రోజూ కూలీ. ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. తండ్రి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల తల్లీకి సాయంగా ఉంటూ డిగ్రీ వరకు చదువుకుంది కర్నె శీరిష.