Barbie-1 Billion Dollars : “బాక్సాఫీస్”లో బార్బీ మ్యాజిక్.. 8000 కోట్లు దాటిన కలెక్షన్స్

Barbie-1 Billion Dollars :  బార్బీ బొమ్మను ఒక క్యారెక్టర్ గా సృష్టించి వార్నర్ బ్రదర్స్  తీసిన "బార్బీ" మూవీ  బాక్సాఫీస్ కలెక్షన్లలో దూసుకుపోతోంది. 

  • Written By:
  • Updated On - August 7, 2023 / 09:36 AM IST

Barbie-1 Billion Dollars :  బార్బీ బొమ్మను ఒక క్యారెక్టర్ గా సృష్టించి వార్నర్ బ్రదర్స్  తీసిన “బార్బీ” మూవీ  బాక్సాఫీస్ కలెక్షన్లలో దూసుకుపోతోంది.

జులై 21న రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం 3 వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.8200 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది.

ఈ సంవత్సరం ఇంత భారీగా కలెక్షన్స్ సాధించిన రెండో అతిపెద్ద మూవీ “బార్బీ” మాత్రమే.

కామ్‌కాస్ట్  కార్పొరేషన్ నిర్మించిన “ది సూపర్ మారియో బ్రదర్స్” మూవీ ఈ ఏడాది కలెక్షన్లలో నంబర్ 1 ప్లేస్  లో ఉంది. ఏప్రిల్‌లో విడుదలైన  ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.11వేల కోట్లను వసూలు చేసింది.

బార్బీ బొమ్మలను తయారు చేసి విక్రయించే బొమ్మల తయారీ సంస్థ మాట్టెల్ ఇంక్ భాగస్వామ్యంతో వార్నర్ బ్రదర్స్ సంస్థ  “బార్బీ” చిత్రాన్ని నిర్మించింది.

Also read : Today Horoscope : ఆగస్టు 7 సోమవారం రాశి ఫలితాలు.. వీరికి ఒత్తిళ్లు అధికం

పిల్లలతో ఈ మూవీకి వెళ్లొద్దు 

‘బార్బీ’ పేరు వినగానే చాలా మంది ఆ సినిమాలో బార్బీ కంటెంట్ ఉందని అనుకుంటున్నారు. కానీ ఈ మూవీ  బార్బీ ల్యాండ్‌ పై ఫోకస్ తో సాగుతుంది. బార్బీ (మార్గాట్ రాబీ), ఆమె ప్రియుడు కెన్ ( ర్యాన్ గోస్లింగ్ ) బార్బీ ల్యాండ్‌లోని కొన్ని వింత ఘటనలపై రీసెర్చ్ చేయడానికి బార్బీ ల్యాండ్‌ కు వెళతారు. ఇది పిల్లల సినిమా కాదు.. పెద్దల కోసం తీసిన మూవీ. ఇందులోని హాస్యాన్ని పెద్దలే అర్థం చేసుకోగలరు. ఈ మూవీని 13 ఏళ్ల వయస్సుకు పైవాళ్లు చూడొచ్చని సెన్సార్ రిపోర్ట్ ఇచ్చింది. ఇది కేవలం టీనేజర్స్‌కే సూటబుల్ అని రివ్యూలు చెబుతున్నాయి. పిల్లలతో ఈ మూవీకి వెళ్లకపోవడమే(Barbie-1 Billion Dollars) బెటర్.