Sanusha : బంగారం సినిమాలో పవన్ కళ్యాణ్ ని ఆటపట్టించిన చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు నటిగా..

బంగారం సినిమాలో పవన్ కళ్యాణ్ ని ఆట పట్టిస్తూ, చివర్లో ఎమోషనల్ గా నటించి ప్రేక్షకులని మెప్పించింది. ఇప్పటికి ఆ క్యారెక్టర్ చాలా మందికి గుర్తుంటుంది.

Published By: HashtagU Telugu Desk
SanushaaBangaram Movie Child Artist Sanusha looks like Heroine

Bangaram Movie Child Artist Sanusha looks like Heroine

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) బంగారం(Bangaram) సినిమా అందరికి గుర్తే. 2006లో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వకపోయిన ప్రేక్షకులని మెప్పించింది. ఈ సినిమాలో హీరోయిన్ కి చెల్లెలి క్యారెక్టర్ లో ఓ పాప నటించింది. తన పేరు సనుషా. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని ఆట పట్టిస్తూ, చివర్లో ఎమోషనల్ గా నటించి ప్రేక్షకులని మెప్పించింది. ఇప్పటికి ఆ క్యారెక్టర్ చాలా మందికి గుర్తుంటుంది.

అయితే ఆ అమ్మాయి ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా. ఇటీవల కూడా ఓ తెలుగు సినిమాలో ముఖ్య పాత్రలో మెప్పించింది సనుషా. సనుషా కేరళకు చెందిన వ్యక్తి. వాళ్ళ అన్నయ్య మలయాళం సినీ పరిశ్రమలో నటుడు. సనుషా రెండేళ్లకే ఓ సినిమాలో కనిపించింది. అయిదేళ్లకే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి మలయాళంలో చాలా సినిమాలు చేసింది. మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టేట్ అవార్డు రెండు సార్లు అందుకుంది. తమిళ్ లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసిన సనుషా 2006లో బంగారం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అప్పటికి సనుషాకు కేవలం పదేళ్లు.

 

ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసిన సనుషా మలయాళంలో మిస్టర్ మరుమకన్ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక అప్పట్నుంచి హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మలయాళం, తమిళ్ లో వరుస సినిమాలు చేస్తుంది. గతంలోనే తెలుగులో ఓంకార్ తమ్ముడు హవీష్ హీరోగా తెరకెక్కిన జీనియస్ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించింది. ఇక నాని జెర్సీ సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో మెప్పించిన నటి ఈ అమ్మాయే. జెర్సీ సినిమాతో సనుషాకు మరింత పేరు వచ్చింది. ప్రస్తుతం మళయాళంలోనే పలు సినిమాలు చేస్తోంది సనుషా. మరి తెలుగులో ఎవరైనా సనుషాకు బ్రేక్ ఇస్తారేమో చూడాలి.

 

Also Read :  KTR : హైదరాబాద్‌కి వార్నర్ బ్రో సంస్థ.. KTR అమెరికా టూర్ లో పెద్ద సంస్థనే తెస్తున్నారుగా..

  Last Updated: 18 May 2023, 08:09 PM IST