టాలీవుడ్ (Tollywood) లో సినిమా ఇండస్ట్రీ మరియు ఏపీ ప్రభుత్వ మధ్య నెలకొన్న వివాదంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) ప్రెస్ మీట్ పెట్టిన వేళ, మరో నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) చేసిన సెటైరికల్ ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గత కొద్దిరోజులుగా సినిమా రంగం అనేక సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవల విడుదల చేసిన లేఖ సినీ ఇండస్ట్రీలో చర్చకు దారితీసింది. ఆ లేఖలో పవన్ కొన్నిరకాల అసంతృప్తులను బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దిల్ రాజు తన వంతు స్పష్టత ఇవ్వడానికి ప్రెస్ మీట్ పెట్టారు.
AP Fee Reimbursement: ఏపీలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపుపై కీలక సర్వే..
దిల్ రాజు మాట్లాడుతూ.. ఏప్రిల్ 19న గోదావరి జిల్లాలో ఎగ్జిబిటర్లు లేవనెత్తిన సమస్యలే ప్రస్తుతం ఉన్న డైలమాకు మూలంగా ఉన్నాయన్నారు. ఇది డిస్ట్రిబ్యూటర్లు , ఎగ్జిబిటర్ల మధ్య ఉన్న వివాదమేనని, దానికి నిర్మాతల గిల్డ్ మధ్యవర్తిత్వం చేసిందని పేర్కొన్నారు. అన్ని అంశాలను తీసుకుని ఈ నెల 30న యాక్షన్ కమిటీ సమావేశం జరుగుతుందని తెలిపారు. అయితే ఈ సమయంలో చేసిన ఆయన వ్యాఖ్యలు… “పెద్దన్న తిడతాడు… మేము పడతాం” అని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
ఇదే సమయంలో బండ్ల గణేష్ చేసిన ట్వీట్ .. “ఆస్కార్ నటులు, కమల్ హాసన్‌లు ఎక్కువైపోయారు. వీళ్ల నటన చూడలేకపోతున్నాం” అంటూ చేసాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇది ఏ వ్యక్తిని ఉద్దేశించి చేయబడిందో ఆయన స్పష్టం చేయకపోయినా, అదే సమయంలో దిల్ రాజు ప్రెస్ మీట్ జరుగుతుండటంతో నెటిజన్లు ఇది ఆయన్నే టార్గెట్ చేస్తూ చేసిన సెటైరికల్ కామెంట్ అనే ఊహగానాలు చేస్తున్నారు. గతంలో కూడా బండ్ల గణేష్ డైరెక్ట్ & ఇన్‌డైరెక్ట్ సెటైర్లు చేయడంలో ముందుండే వ్యక్తిగా ప్రసిద్ధి కావడంతో, ఈసారి కూడా ఇదే కోణంలో చూడడం అనివార్యమవుతోంది.
ఆస్కార్ నటులు , కమలహాసన్లు ఎక్కువైపోయారు . వీళ్ళ నటన చూడలేకపోతున్నాం …..!
— BANDLA GANESH. (@ganeshbandla) May 26, 2025