Bandla Ganesh: పూరీ జగన్నాథ్ పై బండ్ల గణేశ్ సెటైర్లు!

పూరీ జగన్నాథ్ గురించి బండ్ల గణేష్‌కి బాగా తెలుసు. ఆయనతో సుదీర్ఘ బంధం ఉంది.

  • Written By:
  • Updated On - June 23, 2022 / 05:18 PM IST

పూరీ జగన్నాథ్ గురించి బండ్ల గణేష్‌కి బాగా తెలుసు. ఆయనతో సుదీర్ఘ బంధం ఉంది. గతంలో పూరీ జగన్నాథ్‌కి ఖరీదైన బహుమతులు ఇచ్చాడు. ఆయనతో సినిమాలు నిర్మించారు. సమయం దొరికినప్పుడల్లా పూరీపై ప్రేమను కురిపించే బండ్ల గణేశ్ అనూహ్యంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిన్న రాత్రి ‘చోర్ బజార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పూరీ జగన్నాథ్‌పై సెటైర్స్‌తో విరుచుకుపడ్డాడు. బండ్ల గణేష్ ఫైర్‌బ్రాండ్ స్పీచ్‌లతో పాపులర్ అనే విషయం అందరికీ తెలిసిందే. బండ్ల తన ప్రసంగంలో పూరీ జగన్నాథ్ భార్య లావణ్యను సీత, కుంతితో పోల్చారు. ఆమె సహనానికి ప్రతిరూపమని ఆయన అన్నారు.

అయితే ఏ కారణం చేత ఓపిక పట్టిందనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. లావణ్య తన జేబులో ఏమీ లేనప్పుడు పూరీ జగన్నాథ్‌ను వివాహం చేసుకున్నాడని, అయితే స్టార్ డైరెక్టర్ గా నిలదొక్కుకున్నాకా ఆయన చుట్టూ చాలామంది చేరారని (ర్యాంప్, వ్యాంప్) అన్నారు.  అయితే తాను ప్రస్తావిస్తున్న వ్యాంప్ ఎవరనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. పూరీ జగన్నాథ్ కొంతమంది హీరోలకు డైలాగ్ డెలివరీ, మరికొందరికి డ్యాన్స్ మూవ్‌మెంట్స్ నేర్పించి స్టార్స్‌గా మార్చారని, అయితే ఆకాష్ పూరిని విష్ చేయడానికి ఎవరూ రాలేదని సెటైర్లు వేశారు. ప్రస్తుతం బండ్ల గణేష్ ‘చోర్ బజార్’ స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.