Gabbar Singh Rerelease పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ గబ్బర్ సింగ్. 2012 లో రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. బాలీవుడ్ మూవీ దబాంగ్ కి రీమేక్ గా తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర పవర్ స్టార్ స్టామినా ప్రూవ్ చేసింది. ఐతే ఈ సినిమాను సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా రీ రిలీజ్ సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్, డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
ఐతే ఈ ప్రెస్ మీట్ లో మరోసారి పవన్ కళ్యాణ్ మీద తనకున్న అభిమానాన్ని చూపించాడు బండ్ల గణేష్ (Bandla Ganesh). మైక్ అందుకుని పవన్ కళ్యాణ్ నా దేవుడు అంటూ ఫ్యాన్స్ ని అలరించే స్పీచ్ ఇచ్చాడు. ఐతే ఈ కార్యక్రమంలో హరీష్ శంకర్ పై బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. హరీష్ శంకర్ మల్లెపువ్వు లాంటి వాడు. వాటిని ఎవరు ఎలా వాడుకోవాలి అనుకుంటే అలా వాడుతారు. అతను కూడా అంతే.. రాబోయే పాతికేళ్లలో అతని నెంబర్ 1 డైరెక్టర్ గా ఉంటాడని అన్నారు బండ్ల గణేష్.
మరి ఎవరిని ఉద్దేశించి హరీష్ శంకర్ కి సపోర్ట్ గా ఈ కామెంట్స్ చేశారో తెలియదు కానీ బండ్ల గణేష్ మాటల వెనక ఆంతర్యం ఏంటన్నది తెలియలేదు. ఇక మరోపక్క ఈ ప్రెస్ మీట్ లోనే త్రివిక్రం కు కూడా క్షమాపణ చెప్పారు బండ్ల గణేష్. తనకు గబ్బర్ సింగ్ సినిమా రావడానికి ఆయనే కారణమని అన్నారు.
చిరంజీవితో సినిమా సెట్ అయితే అంతకుమించిన అదృష్టం లేదని. చిరంజీవి, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), చంద్రబాబు లాంటి మనుషులు చాలా లిమిటెడ్ ఎడిషన్ వాళ్లు మనకు అందుబాటులో ఉన్నంత మాత్రాన వాళ్లతో మనం సమానమని అనుకోవడం తప్పని ఇన్ డైరెక్ట్ గా అల్లు అర్జున్ మీద పంచ్ వేశారు బండ్ల గణేష్.
Also Read : Nani Success Speech : మిమ్మల్ని కొట్టే వాళ్లు లేరు.. ఆ వెలితి తీరింది..!