Site icon HashtagU Telugu

Bandla Ganesh: బండ్ల గణేష్ సంచలన నిర్ణయం.. రాజకీయాలకు గుడ్ బై..!

Bandla Ganesh

Bandla Ganesh

కమెడియన్ గా సినీ రంగ ప్రవేశం చేసిన బండ్ల గణేష్ తక్కువ కాలంలోనే నిర్మాతగా మారాడు. నిర్మాతగా బండ్ల పలు సూపర్ హిట్ సినిమాలు నిర్మించాడు. అయితే సోషల్ మీడియాలో బండ్ల తన క్రేజ్ ని పెంచుకున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అనేక వివాదాస్పద విషయాల మీద తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటాడు. దీంతో బండ్ల గణేష్ ఎప్పటికప్పుడు వివాదాస్పదమవుతుంటారు. బండ్ల గణేష్ 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరి చాలా యాక్టివ్ గా పని చేశారు. అప్పట్లో ఆయన కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ తో గొంతు కోసుకుంటానంటూ చేసిన కామెంట్స్ కూడా తెగ వైరల్ అయ్యాయి అప్పట్లో.

తాజాగా బండ్ల గణేష్ తను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. నమస్కారం నా కుటుంబ బాధ్యతల వల్ల నా ఉమ్మడి కుటుంబ సభ్యుల నేపథ్యంలో.. వారి కోరికపై మా పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తూ నాకున్న పనులు వల్ల వ్యాపారాల వల్ల నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం గానీ, మిత్రుత్వం గానీ లేదు.. అందరూ నాకు ఆత్మీయలే.. అందరూ నాకు సమానులే.. ఇంతకుముందు నావల్ల ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా బాధపడి ఉంటే నన్ను పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తూ మీ బండ్ల గణేష్ అంటూ ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.