Site icon HashtagU Telugu

Bandla Ganesh:ప్రభాస్ లుక్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన బండ్ల గణేష్..!

Bandla Ganesh Prabhas

Bandla Ganesh Prabhas

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్ర‌భాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆది పురుష్. అయితే ఈ మూవీకి సంబంధించిన టీజ‌ర్‌ను అయోధ్య‌లో ఆదివారం విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఇక ఈ మూవీలో ప్రభాస్ లుక్ రాముడిగా ఉందని మెచ్చుకుంటున్న విష‌యం తెలిసిందే. ఇకపోతే రామునిగా ప్రభాస్ లుక్‌పై తాజాగా నటుడు, నిర్మాత‌ బండ్ల గణేష్ చేసిన కామెంట్లు కొంతమంది నెటిజ‌న్స్‌, ఫ్యాన్స్‌ ఆగ్రహానికి దారితీసింది.

ఇకపోతే ఏదో ఒక విష‌యంలో బండ్ల గణేష్ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూనే ఉంటాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ ఆది పురుష్ లుక్‌పై అదిరిపోయే ఎలివేషన్స్ ఇస్తూ కామెంట్స్ చేశాడు. దీంతో ప్రభాస్ అంటే కొంతమంది గిట్టని నెటిజన్స్ బండ్ల గణేష్‌ను ట్రోల్ చేశారు.

ఆది పురుష్ మూవీలో ప్ర‌భాస్ లుక్‌పై బండ్ల ఈ విధంగా కామెంట్స్ చేశారు. కళ్ళల్లో రాజసం.. మీసంలో పౌరుషం.. అచ్చం శ్రీరామచంద్ర మహాప్రభు లాగా ఉన్న ప్రభాస్ అంటూ కామెంట్ చేశారు. ఇక బండ్ల గణేష్ చేసిన ఈ కామెంట్ ప్రభాస్ ఫ్యాన్స్‌ని ఫిదా చేస్తుంటే వారంతా బండ్ల‌కి కామెంట్స్ రూపంలో కృతజ్ఞతలు తెలిపారు.