NBK- PSPK: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై బాలయ్య ప్రశ్న.. ప్రోమో వైరల్!

ఒటీటీ హిస్టరీలోనే ఇప్పుడు మోస్ట్ బజ్ ఎపిసోడ్ గా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ అన్ స్టాపబుల్ లో భాగంగా రాబోతుంది. పవన్ కళ్యాణ్ కంటెంట్ ని రెండు ఎపిసోడ్స్ గా ఆహా టెలికాస్ట్ చేయడానికి ప్లాన్ చేసింది.

Published By: HashtagU Telugu Desk
unstoppable NBK

Whatsapp Image 2023 01 27 At 23.35.21

NBK- PSPK:ఒటీటీ హిస్టరీలోనే ఇప్పుడు మోస్ట్ బజ్ ఎపిసోడ్ గా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ అన్ స్టాపబుల్ లో భాగంగా రాబోతుంది. పవన్ కళ్యాణ్ కంటెంట్ ని రెండు ఎపిసోడ్స్ గా ఆహా టెలికాస్ట్ చేయడానికి ప్లాన్ చేసింది.

అందులో భాగంగా మొదటి ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ లో ఫ్యాంట్ లు వేసిన విషయంపై ఆసక్తిగా అడిగారు. అలాగే త్రివిక్రమ్ తో ఫ్రెండ్ షిప్ చేయాల్సి వచ్చింది అంటూ పవన్ కళ్యాణ్ ఓ ప్రశ్నకి ఆసక్తిగా సమాధానం చెప్పారు. తరువాత ఇంట్లో రామ్ చరణ్ తో క్లోజ్ ఎందుకు అయ్యారు అని అడిగితే అవ్వాల్సి వచ్చింది అంటూ పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పారు. తరువాత ఇక సాయి ధరమ్ తేజ్ ఈ ఎపిసోడ్ లో కొద్ది సేపు సందడి చేసాడు.

అమ్మాయిలు హర్రర్ సినిమాలలకి తేడా లేదు అంటూ తేజ్ వేసిన సెటైర్ కి ఫన్ క్రియేట్ అయ్యింది. ఇక పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి కూడా బాలకృష్ణ అడిగిన ప్రశ్నకి పవన్ కళ్యాణ్ ఏదో సమాధానం చెప్పాడు. అలాగే చిన్న వయస్సులో మానసిక సంఘర్షణకి గురైన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఎలా అయ్యాడు అంటూ బాలకృష్ణ ప్రశ్న వేసారు. అయితే దానికి పవన్ కళ్యాణ్ ఏదో ఇంటరెస్టింగ్ సమాధానం చెప్పారు. ఇక అన్నయ్య రూమ్ లోకి వెళ్లి ఫిస్తల్ తీసుకొని అంటూ ఏదో చెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో ప్రోమో కట్ చేశారు. ఓ విధంగా చెప్పాలంటే మొదటి ఎపిసోడ్ లోనే చాలా ఇంటరెస్టింగ్ విషయాలని బాలకృష్ణ పవన్ కళ్యాణ్ తో చెప్పించినట్లు తెలుస్తుంది. ఇక ఈ ప్రోమో యుట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతుంది.

  Last Updated: 27 Jan 2023, 11:46 PM IST