నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన ‘అఖండ 2 తాండవం’ చిత్రం థియేటర్లో మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌కి సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ జనవరి 9న ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో అంతగా మెప్పించని ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకుల్ని ఎలా మెప్పిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ సీక్వెల్ మూవీ ‘ అఖండ 2 తాండవం’ గతేడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాలుగేళ్ల క్రితం విడుదలైన ‘అఖండ’కు కొనసాగింపుగా తెరకెక్కిన ఈ చిత్రంపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలో సంయుక్త మీనన్, పూర్ణ, హర్సాలి కీలక పాత్రలు పోషించగా, ఆది పినిశెట్టి విలన్‌గా నటించారు. 14 రీల్స్ ప్లస్, పతాక బ్యానర్లపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ సినిమా ఫైనాన్స్ సమస్యల కారణంగా డిసెంబర్ 12కి వాయిదా పడింది. ఈ ఆలస్యం సినిమాపై నెగటివ్ ప్రభావాన్ని చూపిందనే అభిప్రాయం వినిపించింది.
ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చిన ‘అఖండ 2’కు ఆడియెన్స్ నుంచి మిశ్రమ స్పందన లభించింది. భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చిన ప్రేక్షకుల్లో చాలా మంది నిరాశకు గురయ్యారు. బాలయ్య అభిమానులే ఆశించిన స్థాయిలో సినిమా లేదని పెదవి విరిచిన సందర్భాలు కనిపించాయి. ముఖ్యంగా పార్ట్ 1తో పోలిస్తే కథ, టేకింగ్, ఎమోషనల్ హై పాయింట్స్ ఆశించినంతగా వర్క్ అవ్వలేదన్న విమర్శలు వచ్చాయి. దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడంతో భారీ ఆశలు పెట్టుకున్నారు. శివతత్వం, సనాతన ధర్మం నేపథ్యంగా కథ సాగడంతో నార్త్ ఇండియా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని భావించారు. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆ అంచనాలు నెరవేరలేదు.
ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ పరంగా క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. థియేట్రికల్ రన్ దాదాపు ముగింపు దశకు చేరుకోవడంతో ‘అఖండ 2’ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమవుతోందట. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ బజ్ ప్రకారం జనవరి 9వ తేదీ నుంచి ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని టాక్ నడుస్తోంది. పాన్ ఇండియా భాషల్లో ఓటీటీలో రిలీజ్ చేయనున్న నేపథ్యంలో థియేటర్లలో మిస్ అయిన ఆడియెన్స్ ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సినిమాను ఎలా ఆదరిస్తారా అనే ఆసక్తి నెలకొంది.
కలెక్షన్ల విషయానికి వస్తే, ‘అఖండ 2’ థియేటర్లలో ఆశించిన స్థాయిలో సత్తా చాటలేకపోయింది. విడుదలై 22 రోజులు పూర్తయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా సుమారు రూ.121 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.95 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో సుమారు రూ.7 కోట్లు, ఓవర్సీస్‌లో దాదాపు రూ.5 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా చూస్తే దాదాపు రూ.70 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. ఈ సినిమాకు రిలీజ్‌కు ముందు థియేట్రికల్ బిజినెస్ రూ.103–104 కోట్లుగా ఉండటంతో, బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా రూ.30 కోట్లకు పైగా షేర్ అవసరం ఉంది. ప్రస్తుతం రోజువారీ కలెక్షన్లు చాలా తక్కువగా ఉండటంతో థియేట్రికల్ రన్‌లో బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఓటీటీ రిలీజ్ తర్వాత అయినా ‘అఖండ 2’కు కొత్త రీచ్ వస్తుందేమో చూడాలి.
