నందమూరి అభిమానులు షాక్ లో ఉన్నారు. గత కొద్దీ నెలలుగా అఖండ 2 కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలియంది కాదు..ఇటీవల రిలీజ్ అయినా ట్రైలర్ , మేకింగ్ ఇలా ప్రతిదీ సినిమా పై అంచనాలు పెంచేయడం తో ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ఆత్రుత ఉన్న సమయంలో ప్రీమియర్స్ రద్దు కావడం అభిమానులను , సినీ ప్రేక్షకులను బాధకు గురి చేయగా…ఇక ఈరోజు సినిమా రిలీజ్ అవుతుందని అనుకుంటున్నా సమయంలో సినిమా విడుదల కాకపోవడం తో వారి ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఏ హీరో కూడా వీరితో సినిమాలు చేయొద్దని , ఫైనాన్స్ సమస్యలు ఉంటె ముందే చూసుకోవాలని , అన్ని సెట్ చేసుకున్నాకే రిలీజ్ డేట్ ప్రకటించాలి కానీ ఇలా చేస్తారా అని మండిపడుతున్నారు.
Virat Kohli Records: వైజాగ్‌లో రేపే నిర్ణయాత్మక పోరు.. కోహ్లీని ఊరిస్తున్న 3 భారీ రికార్డులీవే!
ఇక సినిమా రిలీజ్ను వాయిదా వేయడంపై బాలకృష్ణ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఫైనాన్స్ ఇబ్బందులను దాచడంపై నిర్మాతలతోపాటు డైరెక్టర్ బోయపాటిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అభిమానులతో ఆటలు వద్దని, సాయంత్రంలోపు విడుదల కావాల్సిందేనని పట్టుబట్టినట్లు వార్తలు వస్తున్నాయి. బాలయ్య పట్టుదలతో నిర్మాతలు, దర్శకుడు ఒక్కసారిగా కంగుతిన్నారని, ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాతలు రంగంలోకి దిగి, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాతలకు ఆర్థికంగా కొంత సాయం అందించేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ చొరవ, బడా నిర్మాతల తక్షణ సాయంతో ఫైనాన్స్ సమస్యలు తాత్కాలికంగా పరిష్కారమైనప్పటికీ, ఈ సంఘటన సినీ పరిశ్రమలో చర్చకు దారితీసింది.
