Nandamuri Mokshagna: బాలయ్యతో కుమారుడు మోక్షజ్ఞ.. గ్రాండ్ గా ‘బర్త్ డే’ సెలబ్రేషన్స్

నందమూరి బాలకృష్ణ తనయుడు, నందమూరి వారసుడు మోక్షజ్ఞ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

Published By: HashtagU Telugu Desk
Mokshagna1

Mokshagna1

నందమూరి బాలకృష్ణ తనయుడు, నందమూరి వారసుడు మోక్షజ్ఞ పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే బాలకృష్ణ షూటింగ్ జరుపుకుంటున్న NBK107 సెట్స్‌లో మోక్షజ్ఞ పుట్టినరోజును జరుపుకోవడం విశేషం. దీనికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమై ఇప్పుడు వైరల్ అవుతోంది. మోక్షజ్ఞకు తండ్రి బాలయ్య పుట్టినరోజు గ్రీటింగ్స్ తెలియజేసి, కేక్ తినిపిస్తున్న ద్రుశ్యాన్ని ఫొటోలో చూడొచ్చు. ఇందులో బాలయ్య పూర్తిస్థాయి కాస్ట్యూమ్‌లో కనిపిస్తున్నారు. డెనిమ్ ప్యాంట్, జాకెట్ ధరించి ఆకట్టుకున్నాడు.

మోక్షజ్ఞ విషయానికొస్తే.. కొంచెం స్లిమ్ అయినట్లు కనిపిస్తున్నాడు. గత కొంతకాలంగా మోక్షజ్ఞ టాలీవుడ్ అరంగేట్రం గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. అయితే మరో ఏడాది గడిచినా దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి అప్‌డేట్ లేదు. బ్లాక్‌బస్టర్ ఆదిత్య 369కి సీక్వెల్ అయిన ఆదిత్య 999కి దర్శకత్వం వహిస్తానని బాలయ్య గతంలో ప్రకటించారు. మోక్షజ్ఞ ఇందులో ప్రధాన పాత్రలో కనిపిస్తాడని చెప్పారు. బాలయ్య కుమారుడికి అదే తొలి చిత్రం కావచ్చు.

  Last Updated: 07 Sep 2022, 12:50 PM IST