Site icon HashtagU Telugu

Balakrishna : ‘హనుమాన్’ కోసం వచ్చిన బాలయ్య.. సినిమా చూసి ఏమన్నారంటే?

Balakrishna Watched Hanuman Special Show and Appreciated Movie Team

Balakrishna Watched Hanuman Special Show and Appreciated Movie Team

ప్రశాంత్ వర్మ(Prashanth Varma) దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా వచ్చిన హనుమాన్(Hanuman) సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి దూసుకుపోతుంది. చిన్న సినిమాగా విడుదలయి భారీ విజయం సాధించింది. తెలుగులోనే కాకుండా నార్త్, అమెరికాలో కూడా పెద్ద హిట్ అయింది.

ఇక హనుమాన్ సినిమాని ప్రేక్షకులే కాదు సినీ సెలబ్రిటీలు కూడా అభినందిస్తున్నారు. తాజాగా హనుమాన్ సినిమాని బాలకృష్ణ(Balakrishna) చూశారు. బాలయ్య కోసం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో హనుమాన్ స్పెషల్ షో వేశారు చిత్రయూనిట్. బాలయ్య హనుమాన్ సినిమా చూసి చాలా బాగుందని దర్శకుడు, నిర్మాత, చిత్రయూనిట్ ని అభినందించారు. సినిమా బాగా వచ్చిందని అభినందిస్తూ సెకండ్ పార్ట్ ఎప్పుడొస్తుంది, చూడటానికి ఎదురుచూస్తాను అని అన్నారు. ఆంజనేయస్వామి గురించి, ఆయనపై శ్లోకాలు కూడా చెప్పారు.

ఇక హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో బాలయ్యతో సినిమా ఉందని వార్తలు వచ్చాయి. ప్రశాంత్ వర్మ ఇప్పటికే కథ చెప్పానని, బాలయ్యకి నచ్చిందని, ఆయన ఎప్పుడంటే అప్పుడు సినిమా చేస్తానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. దీంతో చిన్న సినిమానే ఈ రేంజ్ లో తీసాడంటే బాలయ్యతో ఇంకెంత పవర్ ఫుల్ సినిమా తీస్తాడో, వీరి కాంబోలో సినిమా వస్తే బాగుండు అని అభిమానులు కోరుకుంటున్నారు.

 

Also Read : PM Modi : మలయాళ నటుడు సురేష్ గోపి కూతురి వివాహానికి హాజరయిన ప్రధాని మోదీ..