Balakrishna : థియేటర్స్ లో అల్లరి చేయండి.. ఆగం చేయకండి.. అమెరికా ఫ్యాన్స్ కు బాలయ్య హెచ్చరిక..

బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాతో సంక్రాంతికి రాబోతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Balakrishna Warning to America Fans before Daaku Maharaaj Release

Balakrishna America

Balakrishna : సాధారణంగా ఫ్యాన్స్ తమ ఫేవరేట్ హీరోల సినిమాలకు థియేటర్స్ లో ఏ రేంజ్ అల్లరి చేస్తారో తెలిసిందే. పేపర్లు ఎగరేయడాలు, కటౌట్స్, పాలాభిషేకాలు, బ్యానర్లు, టపాసులు.. ఇలా థియేటర్స్ వద్ద రచ్చ చేస్తారు. థియేటర్ లోపల కూడా పేపర్స్ ఎగరేసి, ఫైర్ క్రాకర్స్ తో హడావిడి చేస్తారు. అయితే అమెరికా వెళ్లినా మన వాళ్ళు మారకుండా అక్కడ కూడా ఇలాగే చేస్తున్నారు.

గతంలో చాలా సినిమాలకు అమెరికాలో మన తెలుగు వాళ్ళు చేసిన రచ్చ వీడియోల రూపంలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా బాలయ్య సినిమాలకు అయితే హడావిడి ఓ రేంజ్ లో ఉంటుంది. గతంలో అఖండ సినిమాకు తమన్ కొట్టిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి, ఫ్యాన్స్ చేసిన రచ్చ కు అక్కడ థియేటర్స్ లో ఊఫర్స్ పేలిపోయాయి. అప్పట్లో ఈ విషయం పెద్ద రచ్చ అయింది. దీంతో దీనిపై బాలయ్య తాజాగా స్పందించారు.

బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాతో సంక్రాంతికి రాబోతున్నారు. జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కానుంది. దీనికి సంబంధించి అమెరికాలో కూడా ఇటీవల ప్రమోషన్స్ చేసారు. అమెరికాలో డాకు మహారాజ్ ఈవెంట్ నిర్వహించగా అక్కడ బాలయ్య ఫ్యాన్స్, తెలుగువాళ్లు భారీగా హాజరయ్యారు.

ఈ ఈవెంట్లో బాలకృష్ణ మాట్లాడుతూ.. అఖండ జాతర అమెరికా నుంచే మొదలైంది. ఇక్కడే ఊఫర్స్ బ్లాస్ట్ అయ్యాయి. కాని నేను ఒకటే చెప్తున్నా మనం ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం అనేది గమనించి అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడివాళ్లకు కూడా మన సహాయసహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. మనకు ఇండియాలో అలవాటు కాగితాలు ఎగరేయడం, ఫైర్ లాంటివి. కానీ ఇక్కడ అవి న్యూసెన్స్ అన్నట్టు ఉంటుంది. కాబట్టి థియేటర్స్ లో అల్లరి చేయండి కానీ ఆగం చేయకండి. ఇక్కడి థియేటర్స్ వాళ్ళను మనం గౌరవిస్తే మనం ఏంటో మనం చాటుకున్నట్టు అవుతుంది. జరిగింది నా సినిమాలకే కాబట్టి నా తరపున అభిమానులందరికి చిన్న విన్నపం. అల్లరి చేయండి, అరవండి, కేకలు వేయండి, అంతే కానీ ఆగం చేయొద్దు. ఎందుకంటే మన మీద నెగిటివిటి వస్తుంది. ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని మనం పాటించాల్సి ఉంటుంది అని చెప్పారు. మరి బాలయ్య చెప్పినట్టు థియేటర్స్ లో ఫ్యాన్స్ సైలెంట్ గా ఉంటారో లేక రచ్చ చేస్తారో చూడాలి.

 

Also Read : Sundeep Kishan : సందీప్ కిషన్ కి ఆ ఎక్స్ పీరియన్స్ అయ్యిందా..?

  Last Updated: 08 Jan 2025, 09:43 AM IST