తెలుగు సినీ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న క్రేజీ కాంబినేషన్ ఆరంభం కాబోతోంది. యువరత్న నందమూరి బాలకృష్ణ – విక్టరీ వెంకటేష్ (Balakrishna – Venkatesh) ఇద్దరి కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతుంది. తాజాగా అమెరికాలో జరిగిన NATS 2025 వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేష్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ వార్తతో నందమూరి అభిమానులు, వెంకటేష్ అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.
Rangaraya Medical College: వైద్య కళాశాలలో కీచక చేష్టలు.. 50 మంది విద్యార్థినులకు లైంగిక వేధింపులు
ప్రస్తుతం టాలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రాల ట్రెండ్ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ, వెంకటేష్‌ల కలయిక కొత్త రికార్డులకు బాటలు వేసేలా ఉంది. బాలయ్యకి మాస్ ఫాలోయింగ్, వెంకీకి క్లాస్ ప్రేక్షకుల ఆదరణ ఉండటం వలన ఈ ఇద్దరి కలయిక విభిన్న ప్రేక్షక వర్గాల్ని థియేటర్లకు తేవడంలో కీలకంగా మారనుంది. ఈ మల్టీస్టారర్ సినిమాకు దర్శకుడిగా గోపీచంద్ మలినేని పేరు తెగ వినిపిస్తోంది. ఇప్పటికే బాలకృష్ణతో ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ అందించిన గోపీచంద్, మరోసారి బాలయ్యతో చేయనున్న ప్రాజెక్టులో వెంకటేష్ కూడా కీలక పాత్ర పోషించనున్నారు అనే వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
Swollen Feet : పాదాలలో వాపు..సాధారణమేనా? లేదంటే తీవ్ర సమస్యకా? నిపుణుల హెచ్చరిక
ఇదే కాదు వెంకటేష్ . అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో కూడా నటించబోతున్నట్లు వినికిడి. ఈ రెండు క్రేజీ కాంబినేషన్లతో వెంకటేష్ కెరీర్‌లో మరో స్పెషల్ ఛాప్టర్ ప్రారంభమవుతోంది. బాలయ్యతో కలిసి సినిమా చేయడం వలన తన ఫ్యాన్ బేస్‌ను విస్తరించుకునే అవకాశముండగా, చిరంజీవితో కలయిక వలన క్లాస్ ఆడియన్స్‌ను మరింతగా ఆకట్టుకునే అవకాశం ఉంది. ఏదేమైనా, ఈ మల్టీస్టారర్ ప్రాజెక్టులు తెలుగు సినిమా అభిమానులకు పండుగలా ఉండనున్నాయి.