Site icon HashtagU Telugu

Balakrishna : బింబిసార దర్శకుడికి బంపర్ ఆఫర్ ఇచ్చిన బాలయ్య..???

Vashishta

Vashishta

బింబిసార…ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న సినిమా. కల్యాణ్ రామ్  కెరియర్లోనే బిగ్గెస్ట్ వసూళ్లను రాబట్టింది ఈ మూవీ. కొత్త దర్శకుడు వశిష్టకు ప్రశంసలు తెచ్చిపెట్టిన సినిమా. ఈ సినిమాను చూసిన బాలయ్య బాబు దర్శకుడు వశిష్టను అభినందించారు. చిన్న వయస్సులోనే ఇంతటి భారీ విజయాన్ని డీల్ చేసిన తీరును ఆయన కొనియాడారు.

అప్పటికే విశిష్ట గురించి బాలయ్యకు చెప్పిన కల్యాణ్ రామ్…అతనితో మూవీ చేసేందుకు బాలయ్య ఓకే చెప్పారన్న టాక్ వినిపిస్తోంది. మంచి స్టోరీని రెడీ చేసుకుని వినిపించమని వశిష్టతో బాలయ్య చెప్పినట్లుగా తెలుస్తోంది. మరి బాలయ్య బాబుతో వశిష్ట మరో సోషియో ఫాంటసీ ప్లాన్ చేస్తాడో లేదో చూడాలి.