Unstoppable : బాలయ్య – వెంకటేష్ ఆహా అన్‌స్టాప‌బుల్ ప్రోమో వచ్చేసింది.. ఇద్దరు హీరోలు కలిసి ఫుల్ ఎంటర్టైన్మెంట్..

తాజాగా బాలయ్య షోకి వెంకటేష్ వచ్చిన అన్‌స్టాప‌బుల్ ప్రోమో రిలీజ్ చేసారు.

Published By: HashtagU Telugu Desk
Balakrishna Unstoppable With NBK Venkatesh Promo Released

Balayya Venkatesh

Unstoppable With NBK : బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో అన్‌స్టాప‌బుల్ సీజన్ 4 దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సీజన్ లో ఆరు ఎపిసోడ్స్ అవ్వగా తాజాగా ఏడో ఎపిసోడ్ ప్రోమో వచ్చింది. ఈ ఎపిసోడ్ కి వెంకటేష్ వచ్చి సందడి చేసాడు. దీంతో ఇద్దరు స్టార్ హీరోలు ఒకే షోలో కనపడటంతో ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయిపోతున్నారు. వెంకీమామతో పాటు సురేష్ బాబు, డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఈ ఎపిసోడ్ కి వచ్చి సందడి చేసారు.

తాజాగా బాలయ్య షోకి వెంకటేష్ వచ్చిన అన్‌స్టాప‌బుల్ ప్రోమో రిలీజ్ చేసారు. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. ఈ షోలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. నలుగురు ఉన్న ఫోటో చూపించి దాని గురించి మాట్లాడారు. అలాగే నాగచైతన్య గురించి మాట్లాడాడు వెంకటేష్. తన ముగ్గురు కూతుళ్ల ఫోటో చూపించి వాళ్ళ గురించి మాట్లాడాడు వెంకటేష్. అనంతరం సురేష్ బాబు, వెంకటేష్ వాళ్ళ నాన్న రామానాయుడు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. అనంతరం బాలయ్య డైలాగ్స్ వెంకటేష్, వెంకటేష్ డైలాగ్స్ బాలయ్య చెప్పారు. చివర్లో ఇద్దరూ కలిసి డ్యాన్సులు కూడా వేశారు.

ప్రస్తుతం బాలయ్య – వెంకటేష్ అన్‌స్టాప‌బుల్ ప్రోమో వైరల్ గా మారింది. ఇక ఈ ఫుల్ ఎపిసోడ్ డిసెంబర్ 27న రాత్రి 7 గంటల నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మీరు కూడా ఈ ప్రోమో చూసేయండి..

 

Also Read : Allu Arjun : చిక్కడపల్లి పీఎస్‌లో అల్లు అర్జున్ .. పోలీసులు అడగనున్న కీలక ప్రశ్నలివీ

  Last Updated: 24 Dec 2024, 01:22 PM IST