Balakrishna Unstoppable బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో వస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్. ఇప్పటికే 3 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం నాలుగో సీజన్ మొదలు పెట్టారు. మొదటి ఎపిసో గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో స్పెషల్ చిట్ చాట్ నిర్వహించారు. ఇక రెండో ఎపిసోడ్ లక్కీ భాస్కర్ టీం అదే దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, వెంకీ అట్లూరితో నిర్వహించారు. ఇక లేటెస్ట్ గా థర్డ్ ఎపిసోడ్ గా కోలీవుడ్ స్టార్ సూర్యతో నిర్వహించారు.
సింహం తో సింగం స్పెషల్ చిట్ చాట్ ప్రోమో వచ్చేసింది. సూర్య కంగువ (Kanguva) ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య అన్ స్టాపబుల్ షోకి వచ్చారు. సూర్యతో పాటు సినిమాలో విలన్ గా నటించిన బాబీ డియోల్ ఇంకా డైరెక్టర్ శివ కూడా అటెండ్ అయ్యారు. బాలయ్యని చూడగానే వెంటనే కాళ్లకు నమస్కారం చేశాడు సూర్య. బాలకృష్ణ (Balakrishna) కూడా సూర్యని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు.
సూర్య అన్ స్టాపబుల్ ప్రోమో..
ఇక సూర్య పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు వాటి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. కార్తీ ఫోన్ లో సూర్య (Surya) నెంబర్ ఏమని సేవ్ చేసుకుంటాడు అన్న ప్రశ్నతో మొదలై కార్తీకి కాల్ చేసి మరీ షోని మరింత ఆసక్తికరంగా చేశారు.
సూర్య కంగువ కోసం ఈమధ్యనే బిగ్ బాస్ దీపావళి సెలబ్రేషన్స్ లో కనిపించారు. ఇక ఇప్పుడు అన్ స్టాపబుల్ (Unstoppable) షో ద్వారా తెలుగు ఆడియన్స్ కు మరింత దగ్గరవుతున్నాడు. బాలకృష్ణ సూర్య అన్ స్టాపబుల్ ప్రోమో అదిరిపోయింది. సూర్య చేస్తున్న అగరం ఫౌండేషన్ కి సంబందించిన క్లిప్ తో అందరి హృదయాలు బరువెక్కేలా చేశారు. మొత్తానికి ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండగా ఎపిసోడ్ నవంబర్ 8న టెలికాస్ట్ అవుతుందని ప్రకటించారు ఆహా టీం.