Balakrishna : అన్ స్టాపబుల్ షోకి బాలీవుడ్ స్టార్.. సీజన్ 3 ప్లాన్ అదుర్స్..!

నందమూరి బాలకృష్ణ (Balakrishna) డిజిటల్ ఎంట్రీ ఇచ్చి అన్ స్టాపబుల్ షో చేసిన విషయం తెలిసిందే. ఆ షో ద్వారా బాలయ్య అంటే ఏంటన్నది ఆడియన్స్

Published By: HashtagU Telugu Desk
Chandrababu Naidu and Pawan Kalyan are Guest for Balakrishna Unstoppable Season 4

Chandrababu Naidu and Pawan Kalyan are Guest for Balakrishna Unstoppable Season 4

నందమూరి బాలకృష్ణ (Balakrishna) డిజిటల్ ఎంట్రీ ఇచ్చి అన్ స్టాపబుల్ షో చేసిన విషయం తెలిసిందే. ఆ షో ద్వారా బాలయ్య అంటే ఏంటన్నది ఆడియన్స్ కు పూర్తిగా అర్ధమైంది. బాలకృష్ణ హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ సీజన్ 1, 2 రెండు సూపర్ సక్సెస్ అయ్యాయి. అయితే సీజన్ 3 ఎప్పుడు మొదలవుతుందా అని ఆడియన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అహా అన్ స్టాపబుల్ సీజన్ 3 ఉంటుంది కానీ లేట్ అవుతుందని అన్నారు. అయితే ఈమధ్యనే భగవంత్ కేసరి కోసం ఒక స్పెషల్ ఎపిసోడ్ చేశారు ఆహా టీం.

ఇప్పుడు మరో సినిమా కోసం అన్ స్టాపబుల్ రెడీ అవుతుంది. బాలయ్య హోస్ట్ గా బాలీవుడ్ మూవీ యానిమల్ (Animal) సినిమా ప్రమోషన్ చేస్తున్నారట. అన్ స్టాపబుల్ షోకి రణ్ బీర్ కపూర్, రష్మిక డైరెక్టర్ సందీప్ వంగ రాబోతున్నారని తెలుస్తుంది. సందీప్ వంగ సినిమా అంటే యూత్ లో సూపర్ క్రేజ్ ఏర్పడింది. రణ్ బీర్ తో చేస్తున్న యానిమల్ కోసం ఆడియన్స్ అంతా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

యానిమల్ సినిమాను హిందీతో పాటుగా తెలుగులో కూడా అదే రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. యానిమల్ టీం అన్ స్టాపబుల్ (Unstoppable) షోకి వస్తుందని తెలుస్తుంది. టీజర్ తో యానిమల్ టీం మెప్పించగా తప్పకుండా సినిమా అనుకున్న రేంజ్ లోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Also Read : Aamir Khan : ఆమె ఫోన్‌ కాల్ కోసం ఆమిర్ ఎదురుచూపులు.. టెన్షన్ టెన్షన్..

We’re now on WhatsApp : Click to Join

  Last Updated: 11 Nov 2023, 09:17 AM IST