నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రయోగాలు చేస్తున్నారు. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఎన్‌బికె టాక్ షో అన్‌స్టాపబుల్‌తో హోస్ట్‌గా మారిన విషయం తెలిసిందే. మొదటి సీజన్ సూపర్ హిట్ అయింది. తొలి ఎపిసోడ్‌లో మంచు ఫ్యామిలీని ఆహ్వానించారు. రెండో సీజన్ లో మొదటి ఎపిసోడ్‌లో నారా చంద్రబాబు నాయుడు, లోకేష్‌ను ఇన్వైట్ చేసి అటు సినిమావర్గాలు, ఇటు రాజకీయవర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఈ టాక్ షోకి అతిథిగా వైఎస్ షర్మిలను ఆహ్వానిస్తారంటూ సోషల్ మీడియాలో కొత్త గాసిప్ హల్ చల్ చేస్తోంది. ఇదే జరిగితే రాజకీయాల నుంచి షోకు వచ్చిన రెండో వ్యక్తి షర్మిల. ఆమెను ఈ షోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ఈ కార్యక్రమానికి ఆమె వస్తే రాజకీయ అంశాలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న తన సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో షర్మిల ఈక్వేషన్ లాంటి ఆసక్తికరమైన విషయాల గురించి బాలయ్య అడిగే అవకాశాలున్నాయి. ఇటీవల ఎపిసోడ్ లో నందమూరి తారక రామారావు పై చంద్రబాబు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఒకవేళ వైఎస్ షర్మిల షోకి వస్తే, నందమూరి బాలకృష్ణ వివాదాస్పద అంశాలపై ప్రశ్నలు అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఇంటర్వ్యూ ఆమె రాజకీయ ఇమేజ్‌కి చాలా అవసరమైన బూస్ట్ ఇస్తుంది. వైఎస్ షర్మిల రాజకీయంగా వెనుకబడి ఉన్నారు. బలమైన టీఆర్‌ఎస్‌ను ఢీకొట్టాలని ఆమె భావిస్తున్నారని అందరికీ తెలిసిందే.