Site icon HashtagU Telugu

Balakrishna : నాకు నేనే పోటీ.. ఆ దమ్ము ధైర్యం ఉందంటున్న బాలకృష్ణ..!

Balakrishna Speech At Bhagavanth Kesari Block Buster Celebrations

Balakrishna Speech At Bhagavanth Kesari Block Buster Celebrations

నందమూరి బాలకృష్ణ (Balakrishna) మైక్ అందుకుంటే స్పీచ్ అదిరిపోవాల్సిందే. లేటెస్ట్ గా భగవంత్ కేసరి హిట్ తో ఫుల్ జోష్ మీద ఉన్న బాలకృష్ణ ఆ సినిమా బ్లాక్ బస్టర్ దావత్ సెలబ్రేషన్స్ లో స్పీచ్ కూడా అదరగొట్టారు. నిజమైన సంపాదన ప్రేక్షకుల నుంచి వచ్చే నీరాజనాలే అంటూ అవే ఎక్కువ సంతోషాన్ని ఇస్తాయని అన్నారు బాలకృష్ణ. అనిల్ దర్శకత్వంలో అందరు చాలా కష్టపడి పనిచేయం వల్లే భగవంత్ కేసరి ఇంత పెద్ద హిట్ అయ్యిందని అన్నారు.

సినిమా మాద్యమం ద్వారా కొన్ని విషయాలు చెబితే అది అందరికీ రీచ్ అవుతుందని.. అది కూడా చెప్పాల్సిన వాళ్లు చెబితే అది ప్రజల్లోకి వెళ్తుందని అన్నారు. తన కెరీర్ లో ఎప్పుడు ప్రయోగాలకు పెద్ద పీఠ వేశానని అదే తన సక్సెస్ కి కారణమని అన్నారు. ఎలాంటి పాత్ర అయినా చేయగల దమ్ము దైర్యం తనకు ఉన్నానని అది ప్రేక్షకుల మీద ఉన్న నక్కమని నాన్న గారు ఎప్పుడు చెప్పే వారని అన్నారు బాలకృష్ణ. నా సినిమాలు నాకే పోటీ అని ఈ సినిమా రికార్డులు మరో సినిమాతో బ్రేక్ చేస్తామని చెప్పారు బాలయ్య బాబు.

ఈ వేడుకకు రాఘవేంద్ర రావు (Raghavendra Rao) గారు రావడం సంతోషమని. నాన్న గారితో ఆయన చాలా సినిమాలు పనిచేశారని గుర్తు చేశారు. ఇక్కడ దాసరి గారు కూడా ఉంటే బాగుండేది పరిశ్రమ పెద్ద దిక్కుగా ఆయన అందరికీ తలలో నాలుకలా ఉన్నారని ఆయన్ను గుర్తు చేసుకున్నారు.

తనని ఇంతగా ఆదరిస్తున్న అభిమానులు ప్రేక్షకులకు ఇంకా మరెన్నో మంచి సినిమాలతో అలరిస్తానని అన్నారు బాలకృష్ణ. భగవంత్ కేసరి సక్సెస్ లో కాస్ట్ అండ్ క్రూ అందరు భాగస్వాములే అని. అందరు ఈ సినిమాకు సమిష్టి కృషి చేశారని చెప్పారు బాలకృష్ణ.

Also Read : Rukhmini Vasanth : సప్త సాగరాలు దాటి.. సూపర్ ఛాన్స్ అందుకున్న బ్యూటీ..!

We’re now on WhatsApp : Click to Join