Site icon HashtagU Telugu

Balakrishna : బాలకృష్ణ సెటైర్లు వేసింది చిరంజీవి పైనేనా..?

Balakrishna Comments

Balakrishna Comments

సోషల్ మీడియా (Social Media) లో నందమూరి బాలకృష్ణ (Balakrishna) పేరు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటుంది. తాజాగా పద్మభూషణ్ (Padma Bhushan) సత్కార వేడుకలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. “నా లాంటి హీరోగా 50 ఏళ్లు కొనసాగినవారు లేరు” “రాజకీయాల్లోకి వచ్చిన నటులు అడ్రస్ లేకుండా పోయారు” వంటి వ్యాఖ్యలు ఆయన చేసినప్పుడు, వాటి వెనుక ఉన్న సూత్రమేంటి అనే చర్చ మొదలైంది. ఈ వ్యాఖ్యలు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)ని ఉద్దేశించినవే కావచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

గతంలో మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ మధ్య పరస్పర విమర్శలు చాలానే చోటుచేసుకున్నాయి. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో బాలకృష్ణ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. “రాజకీయాలు ఎమోషన్ కాదు” “గొప్ప నాయకుడిని ఓడించి పార్లమెంట్‌కి వెళ్లడం ఏం ఉపయోగం?” అంటూ చిరంజీవిపై తీవ్ర విమర్శలు చేశారు. అదే సమయంలో నాగబాబు కూడా బాలకృష్ణ వ్యాఖ్యలపై గట్టిగానే స్పందిస్తూ వీడియోల ద్వారా కౌంటర్లు ఇచ్చారు. పవన్ కల్యాణ్‌ను కూడా కించపరిచేలా మాట్లాడిన బాలయ్య వ్యాఖ్యలపై అప్పట్లో పవన్ సహా మెగా అభిమానులు అసహనం వ్యక్తం చేశారు.

Ghee: ముఖానికి నెయ్యి రాసుకోవచ్చా.. రాసుకుంటే ఏమవుతుంది.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

అయితే గత కొన్నేళ్లుగా ఈ రెండు ఫ్యామిలీలు కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటూ స్నేహపూర్వకంగా ఉంటున్నట్లుగా కనిపిస్తున్నా, బాలకృష్ణ తాజా వ్యాఖ్యలతో పాత గొడవలు మళ్లీ తెరపైకి వచ్చాయి. “చాలామంది నటులు రాజకీయాల్లో నామరూపాలు లేకుండా పోయారు” అనే వ్యాఖ్యతో బాలకృష్ణ మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చిరంజీవి అభిమానులలో ఆగ్రహాన్ని రేపుతున్నాయి. రాజకీయాల్లో, సినిమాల్లో బాలకృష్ణ చేసే వ్యాఖ్యలు ఎంతైనా స్పందనను రేకెత్తిస్తాయని ఈ ఉదంతం మరోసారి రుజువు చేసింది. నిజంగా బాలకృష్ణ చిరంజీవిని ఉద్దేశించి చేశాడా అనేదానికి కరెక్ట్ గా చెప్పలేం. ఎందుకంటే చిరంజీవి కంటే ముందు చాలామంది తెలుగు , హిందీ , తమిళ్ ఇలా అనేక ఇండస్ట్రీల వారు రాజకీయాల్లోకి వచ్చి మళ్లీ సినిమాల బాట పట్టారు. సో..బాలకృష్ణ చేసింది చిరంజీవి పైనే అని ఏమాత్రం చెప్పలేం. ఏది ఏమైనప్పటికి కొద్దీ నెలలుగా మెగా, నందమూరి ఫ్యాన్స్ ఒకటే అని అంత అనుకుంటాడగా..ఇప్పుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో మరోసారి పాత గొడవలు బయటకు వస్తున్నాయి.

Exit mobile version