Site icon HashtagU Telugu

Nandamuri Balakrishna : దర్శకుడు విశ్వనాథ్‌తో ఆ సీన్ చేయలేనన్న బాలయ్య.. కానీ చివరికి బాధపడుతూ..

Balakrishna Regected A Scene with K Viswanath in Seema Simham Movie

Balakrishna Regected A Scene with K Viswanath in Seema Simham Movie

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) చూడడానికి చాలా కఠినంగా కనిపిస్తారు గానీ, ఆయన చాలా సెన్సిటివ్ పర్సన్. ఆయన ఎంత సున్నితమైన వ్యక్తి అనేది.. ఆయనని దగ్గర నుంచి చూసిన చాలామంది వ్యక్తులు చెప్పుకొస్తూ ఉంటారు. అలా దగ్గర నుంచి చూసిన సీనియర్ నటి ‘వీనిరా ఆడై నిర్మల’.. బాలయ్యకి సంబంధించిన ఓ విషయాన్ని అభిమానులకు తెలియజేసారు.

‘సీమసింహం’ సినిమాలో బాలకృష్ణకి తల్లిగా నిర్మల నటించారు. ఇక తండ్రి పాత్రలో లెజెండరీ డైరెక్టర్ కె.విశ్వనాథ్ నటించారు. మూవీలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ లో బాలయ్య, విశ్వనాథ్(K Viswanath) మధ్య మంచి ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ఈ ఫ్లాష్‌బ్యాక్ స్టోరీలో బాలయ్యకి చెయ్యి, కాలు చచ్చు పడిపోతాయి. ఆ సమయంలో తల్లిదండ్రులు అయిన నిర్మల, విశ్వనాథ్ బాలయ్యకి సేవలు చేస్తూ కనిపిస్తారు.

ఈక్రమంలోనే విశ్వనాథ్ బాలయ్య కాలు దగ్గర కూర్చొని, కాలుకి ఆయిల్ రాసే సన్నివేశం ఉంటుంది. సినిమాలో ఈ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. అయితే లెజెండరీ డైరెక్టర్ అయిన విశ్వనాథ్.. తన కాళ్ళు పట్టుకోవడాన్ని బాలయ్య అంగీకరించలేకపోయారు. ఆ సీన్ చేయనని దర్శకుడికి చెప్పారట. యాక్టింగ్ అయినా సరే విశ్వనాథ్ లాంటి పెద్ద మనిషి, పెద్ద దర్శకుడు తన కాళ్ళు పట్టుకోవడం ఇష్టం లేదని, సీన్ ని మార్చమని సీమసింహ దర్శకుడికి చెప్పారంట.

అయితే మూవీలో ఫాదర్ అండ్ సన్ బాండింగ్ ని కొంచెం లోతుగా చూపే ఆ సీన్ మార్చడానికి ఎవరూ ఇష్టపడలేదు. ఆ సీన్ విలువ ఏంటో ఒక దర్శకుడిగా విశ్వనాథ్ కి కూడా తెలుసు. దీంతో ఆయనే స్వయంగా బాలయ్య దగ్గరకి వెళ్లి.. అది కేవలం యాక్టింగ్ మాత్రమే, ఏమి అవ్వదు నటించు అని ఒప్పించడంతో బాలకృష్ణ ఇబ్బందిపడుతూనే ఆ సీన్ చేశారంట. బాలకృష్ణ పెద్దవారికి అంతటి గౌరవం ఇచ్చేవారని నిర్మల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Also Read : Mahesh Babu : మహేష్ బాబు చేయాల్సిన సినిమా.. తరుణ్ చేశాడు..