Site icon HashtagU Telugu

Balakrishna Raviteja : వెంకటేష్ సినిమాలో బాలయ్య, రవితేజ..!

Raviteja Replaced with Balakrishna for Pongal Release

Raviteja Replaced with Balakrishna for Pongal Release

Balakrishna Raviteja సైంధవ్ ఫ్లాప్ తర్వాత వెంకటేష్ తన నెక్స్ట్ సినిమా సూపర్ హిట్ కాంబినేషన్ ని సెట్ చేసుకున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో అనీల్ రావిపుడి డైరెక్షన్ లో వెంకటేష్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. శివరాత్రికి ఈ సినిమా అనౌన్స్ మెంట్ వస్తుందని చెబుతున్నారు. అయితే లేటెస్ట్ గా ఈ సినిమాలో మరో ఇద్దరు టాప్ స్టార్స్ క్యామియో రోల్ చేస్తారని తెలుస్తుంది.

అనీల్ రావిపుడి హిట్ ఇచ్చిన ఇద్దరు హీరోలను వెంకటేష్ సినిమాలో స్పెషల్ రోల్స్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అందులో ఒకరు బాలకృష్ణ కాగా.. మరొకరు మాస్ మహరాజ్ రవితేజ అని తెలుస్తుంది. వెంకటేష్ సినిమాలో బాలయ్య, రవితేజ కనిపిస్తే ఇక ఆ లెక్క వేరేలా ఉంటుంది. వెంకటేష్ అంటే మిగతా హీరోలందరికీ చాలా ఇష్టమైన హీరో. సో ఆయన సినిమాలో క్యామియో రోల్ చేసేందుకు ఎవరైనా ఓకే చెబుతారు.

అనీల్ తో ఆల్రెడీ మంచి ర్యాపో ఉంది కాబట్టి బాలకృష్ణ, రవితేజ ఇద్దరు వెంకటేష్ సినిమాలో క్యామియో రోల్స్ చేస్తారని టాక్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. 2025 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ లాక్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Also Read : Bollywood Ramayan : బాలీవుడ్ రామాయణం ముహూర్తం ఫిక్స్..!