Balakrishna : ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’ షూటింగ్ టైంలో.. బాలయ్య కండిషన్.. రోజు ఇంటి దగ్గర నుంచి..

బాలకృష్ణ నటించిన ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’ సినిమాకి నందమూరి అభిమానుల్లో ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇక ఈ సినిమా సమయంలో బాలయ్య ఓ కండిషన్ పెట్టారంట.

Published By: HashtagU Telugu Desk
Balakrishna place a Condition on Rowdy Inspector Movie Time

Balakrishna place a Condition on Rowdy Inspector Movie Time

బాలకృష్ణ(Balakrishna) నటించిన ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’ (Rowdy Inspector) సినిమాకి నందమూరి అభిమానుల్లో ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. పోలీస్ నేపధ్య సినిమాలకు అప్పటిలో ఇదొక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇక బాలయ్యని మొదటిసారి పోలీస్ డ్రెస్సులో చూసి అభిమానులు తెగ మురిసిపోయారు. బి గోపాల్‌(B.Gopal) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఇక ఈ మూవీలో పోలీస్ పాత్ర కోసం బాలకృష్ణ ఎంతో హోమ్ వర్క్ చేశారట. పోలీసులు ఎలా నడిచేవారు..? లాఠీ ఎలా పెట్టుకునేవారు..? జీపులో ఎలా కూర్చునేవారు..? అని విషయాలను తెలుసుకున్నారు.

ఇక ఈ సినిమా తెరకెక్కిస్తున్న సమయంలో బాలకృష్ణ పోలీస్ పాత్రలో పూర్తిగా లీనమైపోయారట. ఒక రోజు షూటింగ్ కోసం దర్శకుడు సెట్స్ లో అన్ని సిద్ధం చేసుకొని బాలయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతలో బాలకృష్ణ నుంచి.. “నేను షూటింగ్ కి రావడం లేదంటూ” ఫోన్ వచ్చింది. ఏమైంది అంటూ దర్శకుడు ప్రశ్నించగా, బాలయ్య బదులిస్తూ.. “మూవీలో నేను ఉపయోగిస్తున్న జీపు పంపిస్తేనే నేను షూటింగ్ వస్తాను. లేదంటే రాను” అని చెప్పుకొచ్చారు. దీంతో దర్శకుడు ఆ జీపుని బాలయ్య ఇంటికి పంపించారట.

ఆ జీపులో పోలీస్ డ్రెస్ వేసుకొని లాఠీ ఊపుకుంటూ సెట్స్ లోకి అడుగుపెట్టారట. సినిమా పూర్తి అయ్యేవరకు రోజు అదే జీపు తనకి కావాలని కండిషన్ పెట్టారంట. దీంతో సినిమా పూర్తి అయ్యేవరకు డైలీ జీపులో పోలీస్ లా సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చేవారంట. ఈ విషయాన్ని దర్శకుడు బి గోపాల్ ఒక సందర్భంలో పంచుకున్నారు. కాగా ఈ చిత్రం కంటే ముందు బాలయ్య, బి గోపాల్ కాంబినేషన్ లో ‘లారీ డ్రైవర్‌’ సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంతో ఈ సినిమా అనౌన్స్‌మెంట్ తోనే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక రౌడీ ఇన్‌స్పెక్టర్‌ రెండు కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ.9 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. 60 కేంద్రాల్లో 50 రోజులు. 22 కేంద్రాల్లో 100 రోజులు జరుపుకొంది.

 

Also Read : Sr NTR : ఎన్టీఆర్ మేకప్ వేసుకున్నారని మొదటి రోజే సినిమా నుంచి తప్పుకున్న సినిమాటోగ్రాఫర్..

  Last Updated: 04 Jan 2024, 09:30 PM IST