Site icon HashtagU Telugu

Balakrishna : మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ సినిమాలో బాలయ్య.. సోషియో ఫాంటసీతో..

Balakrishna, Nandamuri Mokshagna, Prasanth Varma

Balakrishna, Nandamuri Mokshagna, Prasanth Varma

Balakrishna : బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ తెరంగేట్రం ఇదిగో అదిగో అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ వారసుడి ఎంట్రీ మాత్రం జరగడం లేదు. అయితే ఈసారి మాత్రం ఎంట్రీ పక్కా అన్నట్లే సౌండ్ వినిపిస్తుంది. కాగా బాలయ్య తన వారసుడిని ఆడియన్స్ కి పవర్ ఫుల్ గా పరిచయం చేసే భాద్యతని యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి అప్పజెప్పినట్లు చెబుతున్నారు. ఆల్రెడీ స్టోరీ కూడా ఫైనల్ అయ్యిందని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నట్లు సమాచారం.

కాగా ఈ సినిమాలో కేవలం వారసుడు మాత్రమే కాదట, బాలయ్య కూడా కనిపించబోతున్నారట. స్క్రిప్ట్ లో హీరోతో పాటు ఒక ముఖ్యమైన కూడా ఉందట. ఆ పాత్రని బాలయ్యతో చేయించాలని దర్శకుడు ఫిక్స్ అయ్యారట. ఇక ఈ సినిమాని మైథలాజికల్ టచ్ తో సోషియో ఫాంటసీ నేపథ్యంతో తెరకెక్కించబోతున్నారట. కాగా ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో.. ఒక కొత్త సూపర్ సినిమాటిక్ యూనివర్స్ ని ఓపెన్ చేసిన విషయం అందరికి తెలిసిందే. మరి ఇప్పుడు నందమూరి హీరోలతో చేయబోయే సినిమాని కూడా ఆ యూనివర్స్ లోనే తెరకెక్కిస్తున్నారా..? లేదా..? అని తెలియాల్సి ఉంది.

ఈ ప్రెస్టీజియస్ సినిమాని సుధాకర్ చెరుకూరి నిర్మించే అవకాశం ఉందని సమాచారం. ఇక హీరోయిన్ గా అతిలోకసుందరి శ్రీదేవి రెండో కూతురు ఖుషి కపూర్ ని వెండితెరకి పరిచయం చేయడానికి సిద్ధం అవుతున్నారట. కాగా హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ని అందుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ దర్శకుడి తరువాత సినిమాల పై ఆడియన్స్ లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇప్పుడు నందమూరి డబల్ ధమాకాతో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. మరి ప్రశాంత్ వర్మ ఈ అంచనాలకు ఎంతవరకు న్యాయం చేయగలడో చూడాలి.