వెండితెరపై జానపద కథలు కనుమరుగయ్యి మాస్ కమర్షియల్ కథలు అలరిస్తున్న సమయంలో.. బాలకృష్ణ (Balakrishna), దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు(Singeetham Srinivasa Rao) సాహసం చేస్తూ ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చిన జానపద కథ సినిమా ‘భైరవద్వీపం'(Bhairava Dweepam). 1994లో రిలీజ్ అయిన ఈ సినిమాలో రోజా హీరోయిన్ గా నటించింది. అసలు ఇలాంటి కథని ఎంచుకోవడమే ఒక సాహసం అంటే.. రౌడీ ఇన్‌స్పెక్టర్, బంగారు బుల్లోడు, నిప్పురవ్వ వంటి సినిమాలతో మాస్ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకున్న బాలయ్యని ఈ మూవీలో కురూపిగా చూపించడం మరో సాహసం.
నిజానికి ఈ మూవీలో బాలయ్య కురూపిగా నటిస్తున్నాడు అన్న విషయం ఆడియన్స్ కి థియేటర్ కి వచ్చే వరకు తెలియదు. వెండితెర పై బాలకృష్ణని అలా చూసి అందరూ షాక్ అయ్యారట. ఇక ఈ కురూపి గెటప్ వేసుకున్న సమయంలో బాలయ్య భోజనం చేసేవాడు కాదట. ఎందుకంటే భోజనం చెయ్యాలంటే ఆ మేకప్ మొత్తం తీయాలి. కురూపి మేకప్ వేయడానికే రెండు గంటలు పడితే, తీయడానికి కూడా అన్నే గంటల సమయం పట్టేది. దీంతో టైం వేస్ట్ అవుతుందని 10 రోజులు పాటు బాలయ్య కేవలం జ్యూస్‌లు మాత్రమే తీసుకుంటూ వచ్చాడట.
పరిశ్రమలో గ్లామర్ డోస్ మరింత రంగులు పూసుకుంటున్న సమయంలో ఒక స్టార్ హీరో కురూపిగా అసహ్యంగా కనిపించడానికి ఒప్పుకోవడం గొప్ప విషయం. అలాంటిది బాలయ్య ఒక నటుడిగా కథ కోసం ఏదైనా చేయాలనే ఆలోచనతో ఒప్పుకొని చేశాడు. కాగా మూవీలో బాలయ్య శాపానికి గురై కురూపిగా మారతాడు. అయితే ఆ శాపాన్ని కథ పరంగా హీరో తల్లిగా చేసిన ‘కేఆర్ విజయ’ తీసుకుంటుంది. దీంతో ఆమెను కురూపిగా చేస్తారా అని అడిగినప్పుడు.. హీరోనే అలా కనిపిస్తున్నప్పుడు, నాకు వేయడానికి అభ్యంతరం ఏముంటుందని బదులిచ్చారట. ఇక ఈ సినిమాకి మేకప్ ఆర్టిస్ట్ గా చేసిన M సత్యం నంది అవార్డుతో పాటు పలు అవార్డ్స్ ని కూడా సొంతం చేసుకున్నారు.
Also Read : BRO : ఏపీలో ఆ రెండు చోట్ల బ్రో షోస్ ను నిలిపివేశారు…