Balakrishna: బాలయ్య బాబు నెక్స్ట్ మూవీ ముహూర్తం ఫిక్స్.. ఇదేం ట్విస్ట్ అయ్య బాబు!

  • Written By:
  • Publish Date - March 14, 2024 / 01:15 PM IST

టాలీవుడ్ నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు బాలయ్య బాబు. అంతేకాకుండా బాలయ్య బాబు సినిమాలు అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ లుగా నిలుస్తున్నాయి. ఇకపోతే బాలయ్య బాబు ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

కాగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కాగా బాలకృష్ణ అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి లాంటి హిట్స్ తర్వాత బాలయ్య నటించి హ్యాట్రిక్ ని కొట్టారు. ఇకపోతే
బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఎన్బీకే109 చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీనికి ఇంకా టైటిల్‌ని నిర్ణయించలేదు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో భారీ కాస్టింగ్ యాడ్‌ అవుతుంది. బాబీ డియోల్‌తో పాటు దుల్కర్‌ సల్మాన్‌, షైన్‌ టామ్‌ చాకో, అలాగే గౌతమ్‌ మీనన్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దీంతో సినిమా రేంజ్‌ అమాంతం పెరిగిపోతుంది. సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి.

ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో సినిమా రాబోతుంది. బాలయ్య తన కొత్త సినిమాని ప్రారంభించబోతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అఖండ సమయంలోనే మళ్లీ వీరి కాంబినేషన్‌లో సినిమా చేయబోతున్నట్టు తెలిపారు. అఖండ2 రాబోతుందన్నారు. కానీ ఇప్పుడు సడెన్‌ ట్విస్ట్ ఇచ్చారు. బాలయ్య నెక్ట్స్ మూవీ జాబితాలో బోయపాటి చేరిపోయాడు. గీతా ఆర్ట్స్ ఈ మూవీని నిర్మించబోతుంది. ఆ మధ్య బోయపాటితో గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్‌ సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే. హీరో ఎవరనేది చెప్పలేదు. అయితే ఈ మూవీ అఖండ2 నా కాదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే అఖండ నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి. ఆయన ఈ మూవీలో భాగం కాలేదు. అలాంటప్పుడు ఆయన ప్రమేయం లేకుండా సీక్వెల్‌ తీయలేరు. మరి ఇప్పుడు బాలయ్యతో చేసే మూవీ ఏంటనేది ఆసక్తికరంగా మారింది.అఖండ2 నే ఇందులో తెరకెక్కిస్తున్నారా? ఇది వేరేనా? అనే ఆసక్తి ఏర్పడింది. అదే సమయంలో పెద్ద సస్పెన్స్ క్రియేట్‌ అయ్యింది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.