NBK 109 : బర్త్‌డే రోజు బాలయ్య సర్‌ప్రైజ్.. NBK 109 సినిమా ఓపెనింగ్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

బాలకృష్ణ తన అభిమానులకు సడెన్ గా ఓ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇన్నాళ్లు బాలకృష్ణ 109వ సినిమా గురించి పలు వార్తలు వినిపించినా ఏవి ఫిక్స్ అవ్వలేదు. కానీ నేడు డైరెక్ట్ సినిమా ఓపెనింగ్ చేశారు.

Published By: HashtagU Telugu Desk
Balakrishna NBK 109 movie iwith Director Bobby opening pooja ceremony happened

Balakrishna NBK 109 movie iwith Director Bobby opening pooja ceremony happened

బాలకృష్ణ(Balakrishna) ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అఖండ(Akhanda), వీరసింహరెడ్డి(Veerasimha Reddy) సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టారు. ఇప్పుడు భగవంత్ కేసరి(Bhagavanth Kesari) అని అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో రాబోతున్నారు. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు బాలయ్య. నేడు బాలయ్య బర్త్‌డే సందర్భంగా భగవంత్ కేసరి టీజర్ రిలీజ్ చేసి అభిమానులను ఖుషి చేశారు చిత్రయూనిట్.

అయితే బాలకృష్ణ తన అభిమానులకు సడెన్ గా ఓ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇన్నాళ్లు బాలకృష్ణ 109వ సినిమా గురించి పలు వార్తలు వినిపించినా ఏవి ఫిక్స్ అవ్వలేదు. కానీ నేడు డైరెక్ట్ సినిమా ఓపెనింగ్ చేశారు. బాలయ్య బర్త్‌డే రోజు NBK109 సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమం చేశారు. ఈ సినిమాను డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తుండగా శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార స్టూడియోస్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్నాయి. నాగవంశీ, త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.

ఇక పూజా కార్యక్రమం అనంతరం ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇది 1980లలో జరిగే కథ అని తెలుస్తుంది. వియోలెన్స్ కి విజిటింగ్ కార్డు అంటూ బాలయ్యని ఎలివేట్ చేశారు. ఇక ఈ పోస్టర్ లో ప్రపంచానికి ఇతని గురించి తెలుసు కానీ ఇతని ప్రపంచం ఎవ్వరికి తెలీదు అని రాశారు. దీంతో ఈ సినిమా పై కూడా అంచనాలు నెలకొన్నాయి. అయితే ఎలాంటి అనౌన్స్ లేకుండా సడెన్ గా సినిమా ఓపెనింగ్ చేసేయడంతో అభిమానులు ఆశ్చర్యపోతూనే ఫుల్ ఆనందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కి వెళ్లనుంది.

 

Also Ready : Samantha: సెర్బియా క్లబ్‌లో సమంత జోరు.. బీరు బాటిల్ పట్టుకొని, ఊ అంటావా పాటకు దుమ్మురేపి!

  Last Updated: 10 Jun 2023, 07:13 PM IST