Balakrishna : NBK 108 టైటిల్ ఇదే.. ‘భగవంత్ కేసరి’ గా పవర్ ఫుల్ బాలయ్య..

ఫుల్ ఫామ్ లో ఉన్న బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. NBK108 వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

Published By: HashtagU Telugu Desk
Balakrishna NBK 108 Movie Title announced as Bhagavanth Kesari

Balakrishna NBK 108 Movie Title announced as Bhagavanth Kesari

బాలకృష్ణ(Balakrishna) ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అఖండ(Akhanda), వీరసింహారెడ్డి(Veerasimha Reddy) సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ భారీ విజయాలు సాధించారు. ఇక ఆహా(Aha)లో అన్‌స్టాపబుల్(Unstoppable) షోతో అలరించారు. మరో పక్క యాడ్స్ కూడా చేశారు. ఇలా ఫుల్ ఫామ్ లో ఉన్న బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

కామెడీ సినిమాలు చేసే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో బాలయ్య మాస్ సినిమా అనడంతో ముందు నుంచి దీనిపై అంచనాలు నెలకొన్నాయి. NBK108 వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ గా చేస్తున్నారు. ఇక శ్రీలీల ఓ ముఖ్య పాత్ర పోషిస్తుంది.

జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు ఉండటంతో రెండు రోజుల ముందే ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కి జోష్ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో 108 హోర్డింగ్స్ తో ఒకేసారి బాలయ్య 108వ సినిమా టైటిల్ ప్రకటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న NBK108 కు ‘భగవంత్ కేసరి'(Bhagavanth Kesari) అనే టైటిల్ ని అనౌన్స్ చేశారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ టైటిల్ వినపడింది. ఇప్పుడు అదే టైటిల్ ని ప్రకటించారు. టైటిల్ తో పాటు ఓ పవర్ ఫుల్ బాలయ్య లుక్ ని కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఆ పోస్టర్ ని షేర్ చేస్తూ.. అన్న దిగిండు.. ఇగ మాస్ ఊచకోత షురూ అని ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య మొదటి సారి తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నారని సమాచారం. దసరాకు ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

 

Also Read : Jr NTR : నిర్మాతగా మారనున్న ఎన్టీఆర్? ఆ హీరోతో సినిమా..

  Last Updated: 08 Jun 2023, 09:24 AM IST