బాలకృష్ణ(Balakrishna) ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూ అభిమానులకు ఫుల్ జోష్ ఇస్తున్నారు. ఇటీవలే తన నెక్స్ట్ సినిమా టైటిల్ భగవంత్ కేసరి(Bhagavanth Kesari)గా ప్రకటించారు. జూన్ 10న బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇక భగవంత్ కేసరి టీం టీజర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వబోతుంది.
వాటితో పాటు బాలయ్య అభిమానులకు మరో ట్రీట్ కూడా రెడీ చేశారు. బాలకృష్ణ కేరీర్ లో సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన నరసింహ నాయుడు(Narasimha Naidu) సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాను 4K వర్షన్ లో డిజిటలైజ్ చేసి జూన్ 10న బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1000 థియేటర్స్ లో రీ రిలీజ్ చేయనున్నారు.
ఈ మేరకు ఓ ప్రెస్ మీట్ నిర్వహించగా నరసింహ నాయుడు దర్శకుడు బి గోపాల్ పాల్గొని మాట్లాడారు. బి.గోపాల్ మాట్లాడుతూ.. నరసింహనాయుడు నాకెరీర్‌లో మరచిపోలేని చిత్రం. బాలయ్య అద్భుతంగా నటించారు. ఎమోషన్స్, యాక్షన్ పరంగా ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తీరు మరచిపోలేను. కత్తులతో కాదురా… కంటి చూపులతో చంపేస్తా’ అన్న డైలాగ్ బాలయ్య చెబితేనే బాగుంటుంది. ఈ సినిమాకు అన్ని కుదిరి అంత భారీ హిట్ అయింది. విజయవాడలో చేసిన వంద రోజుల ఫంక్షన్‌ని ఎప్పటికీ మరచిపోలేను అని అన్నారు.
నరసింహ నాయుడు బాలకృష్ణ కెరీర్ లో సూపర్ హట్ సినిమాల్లో ఒకటి. బి గోపాల్ దర్శకత్వంలో 9 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 30 కోట్లు కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాలో సిమ్రాన్, ప్రీతీ జింగ్యానీ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాలోని కమర్షియల్ సాంగ్స్ ఇప్పటికి రిపీటెడ్ మోడ్ లో వినపడతాయి.
Also Read : Kajol: సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పిన బాలీవుడ్ నటి కాజోల్.. ‘కష్టతరమైన దశను అనుభవిస్తున్నాను’ అంటూ..!