గుండెపోటుకు గురైన సినీ నటుడు నందమూరి తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు విదేశీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ప్రమాదకరమైన స్థితి నుంచి బయటపడినట్టు ఇప్పటికే వైద్యులు వెల్లడించారు. మరోవైపు ఆయనకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం తెలుస్తోంది. తొలుత చికిత్సకు తారకరత్న శరీరం ఏమాత్రం స్పందించలేదని.. అయితే, ఆయన చెవిలో బాలకృష్ణ మృత్యుంజయ మంత్రాన్ని (Mrityunjaya Mantra) పఠించారని… ఆ తర్వాత ఆయన శరీరంలో మార్పు వచ్చి, చికిత్సకు స్పందించిందని చెపుతున్నారు.
ప్రస్తుతం ఆయన కొద్దికొద్దిగా కోలుకుంటున్నారని సమాచారం. తన అన్న కొడుకు ఆరోగ్యం విషయంలో బాలయ్య ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారని చెపుతున్నారు. చికిత్సకు సంబంధించిన అన్ని విషయాలను బాలయ్యకే వైద్యులు చెపుతున్నారని సమాచారం. మరోవైపు తారకరత్న త్వరగా కోలుకోవాలని అభిమానులు, కోరుకుంటున్నారు.
Also Read: SEBI Report: అదానీ అంశంపై ఆర్థిక మంత్రికి సెబీ నివేదిక!