Balakrishna : బాలయ్య సినిమాలకు లాంగ్ బ్రేక్.. రీజన్ అదేనా..?

నందమూరి బాలకృష్ణ (Balakrishna ) సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వనున్నారు. ఏపీ లో ఎలక్షన్ జరిగేంత వరకు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పూరి స్థాయిలో పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ మెంట్

Published By: HashtagU Telugu Desk
Balakrishna Gopichand Malineni Combination Movie Again

Balakrishna Gopichand Malineni Combination Movie Again

నందమూరి బాలకృష్ణ (Balakrishna ) సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వనున్నారు. ఏపీ లో ఎలక్షన్ జరిగేంత వరకు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పూరి స్థాయిలో పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ మెంట్ చూపిస్తున్నారు. జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ఏపీ ఎలక్షన్స్ జరిగేంత వరకు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ఇక ఇప్పుడు బాలకృష్ణ వంతు వచ్చింది. ప్రస్తుతం బాలకృష్ణ చేస్తున్న సినిమాలన్నిటినీ కూడా ఆపేసి గ్యాప్ తీసుకోనున్నారని తెలుస్తుంది.

బాలకృష్ణ రెండు నెలల పాటు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నారట. ఏపీ ఎలక్షన్స్ తర్వాత మళ్లీ షూటింగ్ లో పాల్గొనేలా షెడ్యూల్ ప్లాన్ చేశారట. బాలకృష్ణ ప్రస్తుతం కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా బందిపోట్ల వేట బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తుంది.

సినిమాలో బాలకృష్ణ క్యారెక్టరైజేషన్ కూడా ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ అందిస్తుందని అంటున్నారు. బాలకృష్ణ బాబీ ఈ కాంబో నందమూరి ఫ్యాన్స్ కి నెవర్ బిఫోర్ మాస్ ట్రీట్ అందిస్తారని తెలుస్తుంది. సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా మలయాల హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారని తెలుస్తుంది.

Also Read : Allu Arjun : అల్లు అయాన్ మోడల్ బోల్తే.. తనయుడికి మైలేజ్ పెంచే ప్రయత్నంలో అల్లు అర్జున్..!

  Last Updated: 22 Feb 2024, 10:51 AM IST