ANR Jayanthi : బాలయ్య లేఖ..ఫ్యాన్స్ షాక్

‘నటసామ్రాట్’ అక్కినేని నాగేశ్వర రావు జయంతి (ANR Jayanthi) ఈరోజు. తెలుగు సినిమా పరిశ్రమలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సరికొత్త చరిత్ర సృష్టించిన వ్యక్తి, తెలుగు ప్రేక్షకాభిమానుల ఆదరణ చూరగొన్న మహోన్నత వ్యక్తి ఏఎన్నార్. నటుడిగానే కాకుండా.. స్టూడియో అధినేతగా, నిర్మాతగా అభిరుచిని చాటుకున్నారు. ఈ సందర్బంగా ఆయన కుటుంబ సభ్యులు , అక్కినేని అభిమానులు జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు. ఇదిలా ఉంటె ANR జయంతి సందర్బంగా నందమూరి బాలకృష్ణ (Balakrishna) లేఖ విడుదల చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. […]

Published By: HashtagU Telugu Desk
Balakrishna Anr

Balakrishna Anr

‘నటసామ్రాట్’ అక్కినేని నాగేశ్వర రావు జయంతి (ANR Jayanthi) ఈరోజు. తెలుగు సినిమా పరిశ్రమలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సరికొత్త చరిత్ర సృష్టించిన వ్యక్తి, తెలుగు ప్రేక్షకాభిమానుల ఆదరణ చూరగొన్న మహోన్నత వ్యక్తి ఏఎన్నార్. నటుడిగానే కాకుండా.. స్టూడియో అధినేతగా, నిర్మాతగా అభిరుచిని చాటుకున్నారు. ఈ సందర్బంగా ఆయన కుటుంబ సభ్యులు , అక్కినేని అభిమానులు జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు.

ఇదిలా ఉంటె ANR జయంతి సందర్బంగా నందమూరి బాలకృష్ణ (Balakrishna) లేఖ విడుదల చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. కొన్నాళ్ల క్రితం వరకు కూడా నాగార్జున – బాలకృష్ణ (Nagarjuna vs Balakrishna) ఇద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవారు. ఒకరి వేడుకకు మరొకరు హాజరవడం.. ఇద్దరూ ఛలోక్తులు విసుకోవడంతోపాటు ఎంతో సరదాగా ఉండేవారు. ఏమైందో తెలియదుకానీ హఠాత్తుగా వీరిద్దరి మధ్య దూరం పెరిగింది అనే ప్రచారం కొంతకాలంగా ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతూనేఉంది. ఆ మధ్య ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య అక్కినేని, తొక్కనేని అంటూ నోటి దురుసుతో వ్యాఖ్యానించారు. దీనిపై అక్కినేని అభిమానులు బాలకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు నాగచైతన్య పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు. ఆలా పలుసార్లు బాలకృష్ణ ANR ను తక్కువ చేసి మాట్లాడాడని అందుకే నాగార్జున కు బాలయ్య అంటే కోపం అని ప్రచారం జరుగుతూ వస్తుంది.

ఈ తరుణంలో ఈరోజు ANR జయంతి సందర్బంగా బాలకృష్ణ లేఖ విడుదల చేయడం ఇరు అభిమానులను ఆశ్చర్య పరుస్తుంది. ”తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా ఆయనను స్మించుకోవడం గర్వకారణం. మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన పాత్రలు, తెలుగు సినిమాకు ఆయన చేసిన అమూల్యమైన సేవలు చిరస్మరణీయాలు. ఆయన కృషి, కీర్తి, మరి స్ఫూర్తి ప్రతి నటునికి మార్గదర్శకం. ఈ శతజయంతి సందర్భంగా, తెలుగు సినీ రంగానికి ఆయన అందించిన అపారమైన సేవలకు మనమందరం శిరసు వంచి కృతజ్నతలు తెలుపుదాం. నాటక రంగం నుండి చిత్ర రంగం వరకు, ఆయన చేసిన ప్రయాణం ప్రతి ఒక్కరికి ప్రేరణ.. ఈ రోజు ఆయనకు మనమందరం నివాళి అర్పిస్తూ, ఆయన నటన, కృషి, మరియు పట్టుదలతో వెలసిన విజయాలను స్మరించుకుందాం .” అటు బాలకృష్ణ ప్రెస్ రిలీజ్ చేసారు.

Read Also : Jani Master Case : సినీ నిర్మాత సంచలన వ్యాఖ్యలు

  Last Updated: 20 Sep 2024, 12:47 PM IST