Site icon HashtagU Telugu

NBK 109 : బాలకృష్ణ సినిమాకు కొత్త రిలీజ్ డేట్.. దేవర ఉన్నాడని తెలిసి కూడా..?

NBK 109 Three Titles in Discussion

NBK 109 Three Titles in Discussion

NBK 109 నందమూరి బాలకృష్ణ 109వ సినిమా కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోన్ సినిమాస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాల్సి ఉన్నా లేటెస్ట్ డేట్ ఆడియన్స్ ని సర్ పైజ్ చేస్తుంది.

బాలకృష్ణ 109వ సినిమాగా వస్తున్న ఈ మూవీ నిన్న మొన్నటిదాకా జూలై 17 లేదా 26న రిలీజ్ అవుతుందని వార్తలు రాగా లేటెస్ట్ గా ఈ సినిమా అక్టోబర్ సినిమాల రేసులో ఉంటుందని తెలుస్తుంది. దసరా బరిలో నిలుస్తూ అక్టోబర్ 10న ఎన్.టి.ఆర్ దేవర వస్తున్నాడు. కొరటాల శివ డైరెక్షన్ లో దేవర 1 అక్టోబర్ 10న రిలీజ్ ఫిక్స్ చేశారు.

దానికి ఒక వారం ముందు అంటే అక్టోబర్ 3న బాలకృష్ణ సినిమా రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. సెప్టెంబర్ 27న పవన్ ఓజీ వస్తుండగా ఆ తర్వాత వారం బాలకృష్ణ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ 10న ఎలాగు దేవర వస్తాడు కాబట్టి వారం లో తన స్టామినా చూపించాలని ఫిక్స్ అయ్యాడు బాలయ్య.

Also Read : Kiara Advani : బ్లాక్ లేడీ ఫోజులతో పిచ్చెక్కిస్తుంది.. గేమ్ చేంజర్ భామ క్రేజీ లుక్స్ చూశారా..?