Site icon HashtagU Telugu

Balakrishna : మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలయ్య ఆసక్తికర కామెంట్స్..

Balakrishna Interesting Comments About His Son Mokshagna Teja Entry

Balakrishna Interesting Comments About His Son Mokshagna Teja Entry

Balakrishna : టాలీవుడ్ లో ఇప్పటికే చిరంజీవి, నాగార్జున వారసులు ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్ అలరిస్తున్నారు. దీంతో నందమూరి అభిమానులంతా బాలయ్య వారసుడు కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. గత కొన్నేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పుడు, అప్పుడు అంటూ వార్తలు రావడం తప్ప.. మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం జరగడం లేదు. అయితే తాజాగా ఈ ఎంట్రీ పై బాలయ్య ఆసక్తికర కామెంట్స్ చేసారు.

విశ్వక్ సేన్ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన బాలయ్య మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలో నేను చాలా తక్కువ మందితోనే క్లోజ్ గా ఉంటాను. వారిలో ఒకడు నా సోదరుడు విశ్వక్ సేన్. మా ఇద్దరినీ కలిసి చూస్తే ఒక తల్లి బిడ్డలం అనుకుంటారు. నాలాగే విశ్వక్ కూడా కొత్తదనం చూపించడం కోసం ఎంతో కష్టపడుతుంటాడు. నా కొడుకు మోక్షజ్ఞని వీళ్ళని చూసే నేర్చుకోమని చెబుతుంటాను.

నన్ను, తాతగారిని చూసి కాదు, ఇప్పటి యంగ్ స్టార్స్ ని చూసి నేర్చుకోమని చెబుతుంటాను. ముఖ్యంగా నా గ్యాంగ్ విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ, అడివి శేష్ ని చూసి నేర్చుకోమని మోక్షజ్ఞకి చెబుతుంటాను. రేపో మాపో వాడు ఎంట్రీ కూడా ఉండబోతుంది” అంటూ బాలయ్య వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

కాగా మోక్షజ్ఞ ఎంట్రీ ఈ ఏడాది కచ్చితంగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్టోరీ డిస్కషన్స్ శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం. మరి ఈ నందమూరి వారసుడి ఎంట్రీ ఏ దర్శకుడు చేతిలో, ఎలా ఉండబోతుందో చూడాలి.