Site icon HashtagU Telugu

Balakrishna : స్కందలో బాలయ్య చేస్తే.. రిజల్ట్ రేంజ్ వేరేలా ఉండేది..!

Balakrishna In Skanda Movie

Balakrishna In Skanda Movie

స్కంద సినిమాలో బాలయ్యనా ఇదేంటి బాసు ఈ ఆలోచన ఏదో బాగుందిగా అనుకోవచ్చు. బోయపాటి రామ్ ఇద్దరు కలిసి చేసిన ఈ స్కంద సినిమా మాస్ ఆడియన్స్ కి కాస్త పర్వాలేదు అనిపించినా సగటు సినీ ప్రేక్షకులకు మాత్రం సినిమా రుచించలేదు. అసలు బోయపాటి రామ్ కాంబో అనగానే ఎన్ని అంచనాలు ఏర్పడ్డాయో వాటికి ఏమాత్రం రీచ్ అవలేని విధంగా సినిమా తెరకెక్కించారు. స్కంద (Skanda) సినిమా క్లైమాక్స్ లో రెండో రామ్ వచ్చేస్తాడు. అంటే రామ్ ఇందులో డ్యుయల్ యాక్షన్ అన్నమాట. ఈ ట్విస్ట్ థియేటర్ లో విజిల్స్ పడతాయని అనుకుంటే బాబోయ్ ఇక్కడ మళ్లీ ఇంకో రామ్ ఏంటి అని ఆడియన్స్ అవాక్కయ్యారు.

అయితే ఆ టైం లో రామ్ బదులుగా బాలకృష్ణ (Balakrishna) వచ్చి ఉంటే బాగుండేదని ఆడియన్స్ అనుకుంటున్నారు. అయితే అసలైతే బోయపాటి ఈ కథ రాసుకున్నప్పుడు సెకండ్ రామ్ పాత్ర లేదట. కానీ కథలో మార్పులు చేస్తుండగా క్లైమాక్స్ లో మరో రామ్ వస్తే బాగుంటుంది అనుకున్నాడట. అయితే ఆ పాత్ర రామ్ బదులుగా బాలకృష్ణ చేస్తే సూపర్ గా ఉండేదని ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. అయితే రామ్ స్కంద లో బోయపాటి బాలయ్యని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.

బోయపాటి శ్రీను (Boyapati Srinu) అడిగితే బాలకృష్ణ చేయను అని చెప్పే ఛాన్స్ లేదు. మరి బాలయ్య దాకా ఈ మ్యాటర్ వెళ్లలేదా లేదా హీరో రామ్ బాలకృష్ణ అవసరం లేదనుకుని అతనే చేస్తానని చెప్పాడా అన్నది తెలియదు కానీ స్కంద చివర్లో బాలకృష్ణ వస్తే మాత్రం ఈ రేంజ్ వేరేలా ఉండేది.

అయితే చివర్లో వస్తే సినిమా మొత్తం చేసిన అతని కన్నా బాలకృష్ణకే ఎక్కువ వెయిట్ వస్తుందని సినిమా ఆయన వల్లే ఆడిందనే ఆలోచనతో కూడా రామ్ నో చెప్పి ఉండొచ్చు. స్కంద లో బాలకృష్ణ చేసి ఉంటే మాత్రం సినిమా లెక్క వేరేలా ఉండేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read : Nitya Menon : కుమారి శ్రీమతికి పాజిటివ్ టాక్..!