Site icon HashtagU Telugu

Balakrishna: రాజ‌మౌళి మ‌రో మ‌ల్టీస్టార‌ర్‌!

Rajamouli

Rajamouli

టాలీవుడ్‌లో హాట్ గాసిప్ ఒక‌టి హల్‌చల్ చేస్తోంది. రాజమౌళి మహేష్ బాబుతో తీస్తున్న సినిమాలో కీలక పాత్ర కోసం బాలకృష్ణను తీసుకోబోతున్న‌ట్టు టాక్‌. సినిమాలో ఏకంగా 40 నిమిషాల పాటు ఈ పాత్ర సాగుతుందని కూడా టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ గాసిప్‌లో నిజమెంతో తెలియదు కానీ.. అటు అభిమానుల్లో, ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం హల్‌చల్‌ చేస్తోంది. ఇదే నిజమైతే రాజమౌళి సినిమా మరో మల్టీ స్టారర్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ప్రస్తుతం రాజమౌళి RRR రిలీజ్‌లో బిజీగా ఉన్నారు. ఇక మహేశ్ బాబు చిత్రానికి సంబంధించి చ‌ర్చ‌లు కూడా న‌డుస్తున్నాయి. ఇంకొన్ని వారాలు గ‌డిస్తే కానీ.. ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ మ‌రిన్ని వెల్ల‌డ‌వుతాయి. అయితే బాల‌య్య బాబు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన అన్ స్టాప‌బుల్ కార్య‌క్ర‌మానికి రాజ‌మౌళి గెస్టు గా వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆ కార్య‌క్ర‌మంలో త‌న‌తో ఎప్పుడు సినిమా ఉంటుంద‌ని బాల‌య్య అడ‌గ్గా, రాజ‌మౌళి మాత్రం ఓ న‌వ్వుతో స‌మాధానమిచ్చారు.