Site icon HashtagU Telugu

Balakrishna: బాలయ్యబాబు 108వ సినిమా ప్రకటన వచ్చేసిందోచ్…!!

నందమూరి నటసింహం బాలకృష్ణ కథానాయకుడిగా 107వ సినిమాను గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమా డిసెంబర్ లో విడుదల చేయాలన్న యోచనలో ఉన్నారు. కాగా బాలకృష్ణ తన 108వ సినిమాను అనిల్ రావిపూడితో చేయనున్న విషయం కొంతకాలం క్రితం బయటకు వచ్చింది.

కాగా అనిల్ రావిపూడి పలు ఇంటర్వ్యూలలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టు గురించి బాలకృష్ణ కూడా ధ్రువపరచడం జరిగింది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రకటన వీడియోను వదిలారు. పవర్ఫుల్ సబ్జెక్టుతో ఈ సినిమా రూపొందనున్న విషయాన్ని ఈ వీడియో ద్వారా చెప్పేశారు. అయితే ఈ మూవీలో బాలయ్య సరసన ఎవరు హీరోయిన్ గా నటిస్తున్నారన్న విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version