NBK Unstoppable: ముగ్గురి హీరోయిన్స్ తో బాలయ్య జోరు.. లేటెస్ట్ ప్రోమో అదుర్స్

నందమూరి హీరో బాలయ్య (Balakrishna) మరోసారి అన్ స్టాబబుల్ షోతో ఆకట్టుకున్నాడు. ఈ సారి ముగ్గురి హీరోయిన్స్ తో సందడి చేశాడు.

  • Written By:
  • Updated On - December 20, 2022 / 11:45 AM IST

బుల్లితెరపై నందమూరి హీరో బాలకృష్ణ (Balakrishna) దుమ్మురేపుతున్నాడు. ఇతర హీరోలకు భిన్నంగా ఎనర్జిటిక్, డిపరెంట్ గా షోలు నిర్వహిస్తుండటంతో అన్ స్టాబబుల్ (Unstoppable)కు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఒకవైపు పొలిటికల్ లీడర్స్ ఆహాన్విస్తూ ఆసక్తికర విషయాలను ప్రేక్షకులకు తెలియజేస్తున్నారు. మరోవైపు టాలీవుడ్ ప్రముఖ హీరోహీరోయిన్స్ తో సందడి చేస్తూ ఎంటర్ టైన్ చేస్తున్నారు. అందుకే బాలయ్య నుంచి ఏదైనా ప్రోమో వస్తుందంటే.. ఇటు ప్రేక్షకుల్లోనే కాదు.. అటు టాలీవుడ్ (Tollywood) సైతం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే బాలయ్య యంగ్ రెబల్ స్టార్ తో నిర్వహించిన టాక్ షో కు సంబంధించిన ప్రోమోలు సోషల్ మీడియాలో దుమ్మురేపుతుండగా, తాజా మరో ప్రోమోతో బాలయ్య సందడి చేశారు.

అన్‌స్టాపబుల్ (Unstoppable) విత్ NBK మేకర్స్ తాజా ప్రోమోను విడుదల చేసారు. ఇందులో లెజెండరీ నటీమణులు జయసుధ, జయప్రదతో పాటు ఈ తరం బ్యూటీ రాశి ఖన్నా ఉన్నారు. ప్రోమోలో బాలకృష్ణతో పాటు జయసుధ, జయప్రద డ్యాన్స్ చేస్తూ కనిపించారు. జయప్రద తన షూటింగ్‌ను ఆపివేసి, జయసుధ పెళ్లి కోసం మేకప్ చేయడానికి వెళ్లానని చెప్పింది. దీంతో బాలకృష్ణ తన రియాక్షన్ తో నవ్వు తెప్పించాడు. ఆ తర్వాత బాలకృష్ణ రాశి ఖన్నాను ‘ఇప్పుడు మీకు ఎవరు క్రష్’ అని అడగగా, ఆమె విజయ్ దేవరకొండ అని చెప్పింది. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 23న ప్రీమియర్ అవుతుంది.

ఇక డిసెంబర్ 30, 2022న బాహుబలి నటుడు ప్రభాస్ కనిపించనున్నారు. బాలయ్యతో ప్రభాస్, గోపిచంద్ చేసిన సందడిని ఈనెల 30న స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే ఈ షోకు సంబంధించిన ప్రోమో ఇప్పటికే యూట్యూబ్‌లో విడుదలై సందడి చేస్తుంది. ఈ ప్రోమోను కోట్లలో .. ప్రభాస్ (Prabhas) అభిమానులు, బాలయ్య అభిమానులు చూసేశారు. దీంతో ప్రభాస్ ప్రోమో రికార్డులు క్రియేట్ చేసేస్తోంది. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఎపిసోడ్ ప్రోమో ఇప్పుడు ఆహా క్రియేట్ చేసిన పాత యూట్యూబ్ రికార్డులను బద్దలు కొడుతోంది. కొద్దిసేపటికే, ప్రోమో 1.4 మిలియన్లకు పైగా లైక్‌లతో 1.3 కోట్లకు పైగా డిజిటల్ వ్యూస్ సాధించింది.

Also Read: NTR statue: అమెరికాలో తొలిసారిగా ఎన్టీఆర్ విగ్రహా ఏర్పాటు!