సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా ఏ సినిమా చేసినా కూడా అది సూపర్ హిట్టే అవుతుంది. ఆర్య, ఆర్య 2 తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ కలిసి చేసిన పుష్ప మొదటి పార్ట్ తోనే సంచలన విజయం అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా సెకండ్ పార్ట్ కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అసలైతే ముందు ఆగష్టు 15న పుష్ప 2 రిలీజ్ అనుకోగా అది కాస్త డిసెంబర్ 6కి వాయిదా వేశారు. రిలీజ్ ఇంకా 100 రోజులు ఉన్న కారణంగా చిత్ర యూనిట్ ఫ్యాన్స్ ని అలర్ట్ చేస్తూ ఒక పోస్టర్ వదిలారు.
ఇదిలాఉంటే పుష్ప 2 సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో భారీ రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఐతే డిసెంబర్ 6న వస్తున్న పుష్ప 2 (Pushpa 2) కి పోటీగా మరో సినిమా రాబోతుందని తెలుస్తుంది. డైరెక్ట్ ఫైట్ కాదు కానీ డిసెంబర్ 6న పుష్ప 2 వస్తుంటే ఒక నాలుగు రోజుల ముందు అంటే డిసెంబర్ 2న ఎన్.బి.కె 109వ సినిమా వస్తుందని తెలుస్తుంది.
పుష్ప రాజ్ తో బాలయ్య ఫైట్ ఉంటుందా అంటే దాదాపు కన్ ఫర్మ్ అని అంటున్నారు. అఖండ రిలీజైన డేట్ కే బాలయ్య 109వ సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న బాలకృష్ణ (Balakrishna) 109వ సినిమాను కె ఎస్ బాబీ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతెల హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఈ సినిమాలో బాలయ్య మార్క్ యాక్షన్ తో పాటు బాబీ తన మార్క్ డైరెక్షన్ తో అదరగొట్టేస్తాడని టాక్. మరి పుష్ప రాజ్ తో పోటీకి వస్తారా లేదా అన్నది తెలియదు కానీ బాలకృష్ణ 109, పుష్ప 2 ఫైట్ కన్ఫర్మ్ అంటున్నారు.