Site icon HashtagU Telugu

Aavesham : వంద కోట్ల మార్క్ వైపు మరో మలయాళం సినిమా.. బాలయ్య రీమేక్ చేయాలంటూ..

Balakrishna Fans Want To Remake Of Fahadh Faasil Aavesham Movie

Balakrishna Fans Want To Remake Of Fahadh Faasil Aavesham Movie

Aavesham : తెలుగు, కన్నడ సినిమా పరిశ్రమలు తరువాత సౌత్ లో మలయాళ సినిమా రైజ్ కనిపిస్తుంది. ఒకప్పుడు మలయాళ చిత్రాలు 50 కోట్లు వసూళ్లు చేయడమే గగనం అనిపించేది. కానీ ఇప్పుడు వంద, రెండు వందల కోట్లు మార్క్ ని క్రాస్ చేసి అద్భుతాలు సృష్టిస్తున్నాయి. 2018 మూవీతో స్టార్ట్ అయిన ఈ రైజ్.. ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్, ఆడు జీవితం ది గోట్ లైఫ్ సినిమాలు 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసాయి. మంజుమ్మల్ బాయ్స్ అయితే 200 కోట్ల మార్క్ ని క్రాస్ చేస్తే.. ఆడు జీవితం 150 కోట్ల మార్క్ ని అందుకుంది.

ఇక తాజాగా మరో మలయాళ సినిమా కూడా 100 కోట్ల మార్క్ వైపు పరుగులు పెడుతుంది. పుష్ప సినిమా ద్వారా తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటించిన ‘ఆవేశం’ సినిమా.. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద తన ఆవేశాన్ని చూపిస్తూ వెళ్తుంది. మార్చి 11న రిలీజైన ఈ చిత్రం.. ఇప్పటివరకు 80 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టినట్లు సమాచారం. ఈ సినిమా థియేటర్స్ వద్ద ఆడియన్స్ జోష్ చూస్తుంటే.. మరికొన్ని రోజుల్లో ఈ మూవీ 100 కోట్ల మార్క్ ని దాటేసేలా కనిపిస్తుంది.

ఒకవేళ ఈ మూవీ 100 కోట్ల మార్క్ క్రాస్ చేస్తే ఫహాద్ ఫాజిల్ కి మొదటి 100 కోట్ల సినిమా అవుతుంది. ఇది ఇలా ఉంటే, ఈ సినిమా చూసిన తెలుగు ఆడియన్స్.. ఈ మూవీని బాలయ్య రీమేక్ చేస్తే బాగుటుందని చెబుతున్నారు. యాక్షన్ కామెడీతో వచ్చిన ఈ చిత్రం.. కేవలం మలయాళంలోనే రిలీజ్ అయ్యింది. ఈ మూవీలోని హీరో పాత్ర ఆడియన్స్ కి బాగా రీచ్ అయ్యింది. ఆ పాత్రలో ఫహాద్ జీవించేసి ఆడియన్స్ కి బాగా దగ్గర చేసారు.

ఇక ఈ పాత్ర చూసిన తెలుగు ఆడియన్స్‌కి.. పైసా వసూల్ లో బాలయ్య పోషించిన తేడాసింగ్ గుర్తుకు వస్తున్నాడు. పైసా వసూల్ హిట్ అవ్వకపోయినా.. తేడాసింగ్ పాత్ర ఆడియన్స్ కి బాగా రీచ్ అయ్యింది. ఇప్పుడు ఆవేశం మూవీలోని పాత్ర కొంచెం అలాగే ఉండడంతో.. ఈ హిట్ మూవీని బాలయ్య రీమేక్ చేస్తే బాగుటుందని ఆశ పడుతున్నారు. మరి ఆడియన్స్ కోరిక బాలయ్య వరకు వెళ్తుందో లేదో చూడాలి.

Also read : Chiranjeevi : జనసేనకు ఓపెన్‌గా మద్దతు ఇచ్చిన చిరంజీవి.. వీళ్లకు సపోర్ట్ చేయండి అంటూ..