Site icon HashtagU Telugu

Balakrishna : బాలకృష్ణ ‘రూలర్’ మూవీ గెటప్ వెనుక ఉన్న స్టోరీ తెలుసా..? ఒక అభిమాని కోసం..

Balakrishna Did A French Mustache Look In Ruler Movie For His Fan Wish

Balakrishna Did A French Mustache Look In Ruler Movie For His Fan Wish

నందమూరి బాలకృష్ణ(Baakrishna) దశబ్దాల కాలంగా ప్రేక్షకులను అలరిస్తూనే వస్తున్నాడు. ఇండస్ట్రీలో ఎంతో మాస్ ఇమేజ్ ని సొంతం చేసుకొని స్టార్ హీరోగా చక్రం తిప్పిన బాలయ్య.. ఇప్పటికి కూడా ఇంకా అదే ఇమేజ్ తో ముందుకు సాగుతున్నాడు. నేటి కొందరు యంగ్ స్టార్ హీరోలకు కూడా సాధ్యం కానీ 100 కోట్ల కలెక్షన్స్ ని అందుకుంటూ సత్తా చాటుతున్నాడు. 100 పైగా సినిమాలు చేసిన బాలయ్య.. ఇప్పటికి కూడా మూవీ కోసం ఎంత కష్టపడుతుంటాడు. పాత్ర కోసం, ఆ పాత్ర గెటప్ కోసం ఎంతో శ్రమ పడుతుంటాడు.

అఖండ సినిమాలో ‘అఘోర’గా కనిపించి అదరగొడితే, పైసా వసూల్ సినిమాలో ‘తేడా సింగ్’గా అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చాడు. ఇక ‘రూలర్’ సినిమా సినిమా విషయానికి వస్తే.. ఆ చిత్రంలో ఒక హాలీవుడ్ స్టార్ హీరో లుక్ లో ఫ్రెంచ్‌కట్‌ గడ్డం లుక్‌ తో కనిపించి అందర్నీ థ్రిల్ చేశాడు. రూలర్ సినిమాలో బాలయ్య పోలీస్ అండ్ బిజినెస్ మెన్ గా రెండు డిఫరెంట్ పాత్రల్లో కనబడతాడు. అయితే బాలయ్య బిజినెస్ మెన్ గా కనబడే గెటప్.. అప్పటిలో బాగా వైరల్ అయ్యింది. అయితే ఆ క్యారెక్టర్ లుక్ వెనుక ఒక కథ ఉంది.

ఒకసారి ఒక అభిమాని బాలయ్యకి ఒక హాలీవుడ్ స్టార్ హీరో ఫోటో పంపించి.. “మిమ్మల్ని ఈ ఫొటోలో ఉన్న గెటప్ లో చూడాలని ఉంది” అని తన కోరికను తెలియజేశాడు. ఇక ఆ విషయాన్ని బాలకృష్ణ తన మనసులో దాచుకున్నాడు. రూలర్ సినిమా టైంలో డైరెక్టర్ బాలయ్యని ఒక డిఫరెంట్ లుక్ లో చూపిద్దాం అని ఆలోచన చేశారు. ఇక ఆ విషయం బాలకృష్ణకి చెప్పగా.. బాలయ్యకి అభిమాని కోరిక గుర్తుకు వచ్చింది. వెంటనే ఆ ఫోటోని చూపించాడు. డైరెక్టర్ కూడా ఆ లుక్ కి ఒకే చెప్పేశాడు. దీంతో రూలర్ సినిమాలో ఫ్రెంచ్‌కట్‌ గడ్డం లుక్‌ లో కనిపించి అభిమాని కోరిక తీర్చేశాడు. ఇక ఈ ఒక్క విషయం సరిపోదు బాలయ్య తన అభిమానులను ఎంతగా ప్రేమిస్తాడో అని చెప్పడానికి.

 

Also Read : Rahul – Chinmayi : రాహుల్ అండ్ చిన్మయి ప్రేమ కథ.. ఎవరి వల్ల ఎప్పుడు కలిశారో తెలుసా?