చిత్రసీమ(Film Industry)లో వారసులు , వారసురాళ్లు ఎంట్రీ అనేది ఈరోజుది కాదు ఎప్పటి నుండో నడుస్తూ వస్తున్నదే..ప్రతి ఒక్క ఇండస్ట్రీ లో వారసుల ఎంట్రీ నడుస్తుంది. నిర్మాతలుగా , హీరోలుగా , హీరోయిన్స్ గా ఇలా అనేక శాఖల్లో ఎంట్రీ ఇస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో అందరు సెట్ అవ్వడం లేదు. కొంతమంది అగ్ర స్థానానికి చేరుకుంటుండగా..మరికొంతమంది మాత్రం ప్లాప్ అయ్యి..మధ్యలోనే ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక టాలీవుడ్ (Tollywood) ఇండస్ట్రీ లో పెద్ద ఫ్యామిలీస్ అంటే మెగా , నందమూరి , ఘట్టమనేని , దగ్గుపాటి , అక్కినేని అనే చెప్పాలి. ఈ ఐదు ఫ్యామిలీల నుండి ఎంతోమంది ఇండస్ట్రీకి పరిచమై రాణిస్తుండగా..కొంతమంది అగ్ర స్థానం కోసం కష్టపడుతున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ (Mokshagna ) ఎంట్రీ కోసం అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. కానీ వారి ఎదురుచూపులు మాత్రం తెరపడడం లేదు. ప్రస్తుతం హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Vamra) డైరెక్షన్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు గట్టిగా వినిపిస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా మరో వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతూ..నందమూరి అభిమానుల్లో సంతోషం రేపుతోంది.
బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్వి (Balakrishna Daughter Tejaswini)ని కూడా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్లో వైరల్ గా మారింది. అయితే నటిగా కాదు.. నిర్మాతగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెపుతున్నారు. మొదటి నుండి తేజస్వికి చిత్ర పరిశ్రమ పట్ల ఆసక్తి ఉంది. అన్‌స్టాపబుల్ , ఇతర షోల విషయంలో తేజస్విని తన తండ్రికి చేదోడు వాదోడుగా నిలిచారు. ఈ క్రమంలోనే తమ్ముడిని లాంచ్ చేసే బాధ్యతను తేజస్వినికే అప్పగించారట బాలకృష్ణ. మరి ఈ వార్తల్లో ఎంత మేరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
Read Also : YS Jagan : జగన్ పాలన.. ఆదాయం 483 కోట్లు.. ఖర్చు 655 కోట్లు