నందమూరి బాలకృష్ణ (Balakrishna) లేటెస్ట్ మూవీ ఎన్.బి.కె 109 సినిమా కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వాల్తేర్ వీరయ్య తర్వాత బాబీ (Bobby) డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా భారీ అంచనాలు ఏర్పరచుకుంది. ఇక వరుస సక్సెస్ లతో సూపర్ ఫాం లో ఉన్న బాలకృష్ణ ఈసారి డాకు మహారాజ్ గా రాబోతున్నాడు. బాబీ మాస్ టేకింగ్ బాలయ్య లుక్ డాకు మహారాజ్ టీజర్ ఫ్యాన్స్ కే కాదు కామన్ ఆడియన్స్ కి కూడా గూస్ బంప్స్ తెప్పించేసింది.
కథ పెద్దగా రివీల్ చేయకపోయినా మహారాజ్ అంటూ బాలయ్యకు ఇచ్చిన ఎలివేషన్.. టీజర్ కట్స్.. ముఖ్యంగా థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. బాలయ్య, థమన్ కాంబో నుంచి మరో మైండ్ బ్లాక్ మ్యూజిక్ మేనియా రాబోతుంది. టీజర్ మాత్రం ష్యూర్ షాట్ హిట్ మెటీరియల్ అనిపించేలా ఉంది. ఇక సినిమాను సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు.
బాలకృష్ణ డాకు మహారాజ్..
జనవరి 12న బాలకృష్ణ డాకు మహారాజ్ (Daku Maharaj) సినిమా రిలీజ్ లాక్ చేశారు. సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతెలా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమా కచ్చితంగా సంక్రాంతి విన్నర్ అయ్యే క్వాలిటీస్ అన్ని కనిపిస్తున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ మూవీస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా తో బాలయ్య మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు.
డాకు మహారాజ్ టీజర్ అదిరిపోయింది. టీజర్ లో మాస్ మూమెంట్స్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేలా ఉన్నాయి. జస్ట్ శాంపిల్ తోనే బాబీ టేకింగ్ ఏంటన్నది తెలుస్తుంది. ఇక సినిమా ఊరా మాస్ హిట్ కొట్టడం గ్యారెంటీ అనేలా ఉంది.