Site icon HashtagU Telugu

Balakrishna : కోట్లు ఇస్తామన్న బాలకృష్ణ ఆ పని చేయలేదట

Balakrishna

Balakrishna

ప్రస్తుతం చిత్రసీమలో క్రేజ్ ఉన్న స్టార్లు ఓ పక్క సినిమాలు (Movies) చేస్తూనే..మరోపక్క పలు సంస్థలకు యాడ్స్ (Ads) చేస్తూ ..ప్రచార కర్త గా ఉంటూ డబ్బులు సంపాదిస్తున్నారు. సినిమాల ద్వారా కన్నా ఇలా పలు యాడ్స్ చేస్తూ ఎక్కువ సంపాదించే వాళ్లు చాలామందే ఉన్నారు. ఉదాహరణ కు మహేష్ బాబు , అల్లు అర్జున్ లే. మహేష్ బాబు ఏడాదికి ఒక్క సినిమా , అల్లు అర్జున్ రెండేళ్లకు ఒక్క సినిమా చేస్తున్నప్పటికీ యాడ్స్ ద్వారా మాత్రం వీరు గట్టిగానే వెన్కకేసుకుంటున్నారు. మిగతా హీరోలు మాత్రం క్రేజ్ ఉన్నప్పటికీ , పలు సంస్థలు కోట్ల రూపాయిలు ఇష్టం..తమ ప్రోడక్ట్ కు ప్రచారం చేయమని అడుగుతున్నప్పటికీ వారు మాత్రం పెద్దగా ఇంట్రస్ట్ చూపించడంలేదు.

ఇక నందమూరి బాలకృష్ణ సైతం ఎన్నో సంస్థలు తనవద్దకు వచ్చి కోట్ల రూపాయిల ఆఫర్లు ఇచ్చినప్పటికీ బాలయ్య మాత్రం చేయనంటే చేయనని తేల్చి చెప్పాడట. గతంలో ఆయన దగ్గరకు ఒక యాడ్ వచ్చిందట.. భారీ పారితోషికం ఇవ్వడానికి ఓ కంపెనీ ముందుకు వచ్చినా కానీ బాలయ్య మాత్రం కమర్షియల్ యాడ్స్‌ను చేసే ఉద్దేశం లేదని నిర్మోహమాటంగా చెప్పేశారట. ఆ తర్వాత ఆయనకు తగ్గ యాడ్స్ ఆయన వద్దకు చాలానే వచ్చాయి. కానీ ఆయన దానికి నో చెప్పాడట. బాలయ్యకు జనాలను మోసం చేయడం ఇష్టం లేక ఆ ప్రచార వీడియోల్లో నటించడానికి నో చెప్పినట్లు ఆయన సన్నిహితులు చెప్పుకొచ్చారు. ఏదైనా ఒక ఉత్పత్తి గురించి మాట్లాడాలంటే అందులో నిజం ఉంటేనే మాట్లాడతాను లేకుంటే లేదని , డబ్బు సంపాదించడం ఇష్టం లేదు కాబట్టే బాలయ్య బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించలేదని వారు తెలిపారు. ఈ వార్త తెలిసి ఫ్యాన్స్ బాలయ్య గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ జ్యుయలరీ యాడ్ తప్ప ఎలాంటి యాడ్స్ లలో నటించడం లేదు.

Read Also : Ilaiyaraaja : ఇళయ రాజాకు అవమానం.. గర్భగుడి నుంచి బయటకు పంపిన ఆలయ నిర్వాహకులు