Site icon HashtagU Telugu

Sridevi Vs Suguna Sundari: టాక్ ఆఫ్ ది టాలీవుడ్.. బాలయ్య, చిరుతో శృతి రొమాన్స్!

Sridevi vs Suguna Sundari Shruti haasan

Shruthi

టాలీవుడ్ (Tollywood) ప్రేక్షకులు సంక్రాంతి పండుగ వైపు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పండుగ తో పాటు పెద్ద హీరోల సినిమాలు సైతం సందడి చేయబోతున్నాయి. ముఖ్యంగా చిరంజీవి, బాలయ్య సినిమాలు సంక్రాంతి (Sankranthi) రేసులో రిలీజ్ అవుతుండటంతో ఇరు అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో వాల్తేరు వీరయ్య, వీర సంహారెడ్డి సినిమాల పట్ల అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించిన పాటలు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నాయి. అయితే  రెండు మెలోడీల్లో ఒకే హీరోయిన్‌ (Shruti Haasan) తో స్టార్ హీరోలు రొమాన్స్ చేయడం మరింత ఆసక్తిని రేపింది.

వీరసింహా చిత్రం సుగుణ సుందరి రెండు రోజుల క్రితం విడుదల కాగా, వీరయ్యలోని శ్రీదేవి చిరంజీవి పాటను సోమవారం విడుదల చేశారు. రెండు పాటల్లోనూ హీరోయిన్ శ్రుతిహాసన్ చాలా అందంగా కనిపించిందనే చెప్పాలి. టర్కీలోని అందమైన ప్రదేశాల్లో సుగుణ సుందరిగా శ్రుతి హాసన్ (Shruti Haasan) వెస్ట్రన్ స్టైల్ దుస్తుల్లో మోడ్రన్ గా కనిపించింది. బాలయ్య తో మాస్ స్టెప్పులు వేసింది. ఇక శ్రీదేవి పాటలో ఫ్రాన్స్ లో మంచుకొండల మధ్య మెగా స్టార్ చిరంజీవితో కలిసి డ్యూయట్ పాడుకుంది. సుగుణ సుందరిలోని ఆ మాస్-బీట్ స్టెప్పులు, శ్రీదేవి పాటలోని ఆ సొగసైన డ్యాన్స్ మూవ్‌లు కూడా ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి. ప్రస్తుతానికి శృతి (Shruti Haasan) రెండు పాటలు హైలైట్ గా నిలిచాయి.

Also Read: Raashi Khanna Likes Vijay: విజయ్ దేవరకొండపై మనసు పారేసుకున్న రాశీకన్నా!