Site icon HashtagU Telugu

Balakrishna Crush: రష్మికపై బాలయ్య క్రష్.. టాక్ షో లో ఓపెన్ కామెంట్స్!

Balakrishna

Balakrishna

నందమూరి వారసుడు బాలకృష్ణ అంటే పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ సీనియర్ హీరోగా, హిందూపురం ఎమ్మెల్యేగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితుడు. అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె షో వల్ల నటసింహ నందమూరి బాలకృష్ణలో మరో యాంగిల్ ను చూస్తున్నాం. మొదటి సీజన్ విజయవంతమైన తర్వాత, ఈ షో రెండవ సీజన్‌ను మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో ప్రారంభమైంది. తాజాగా మరో ఎపిసోడ్ ప్రోమో చక్కర్లు కొడుతోంది. DJ టిల్లు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ బాలయ్యతో సందడి చేశారు. లెటెస్ట్ ప్రోమోతో  నెక్ట్స్ ఎపిసోడ్ వినోదాత్మకంగా ఉండబోతోందని తెలుస్తోంది.

డాషింగ్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపించిన బాలకృష్ణ హీరోయిన్లలో తనకి ఉన్న క్రష్ గురించి ఓపెన్ కామెంట్స్ చేశారు. ఆ క్రష్ ఎవరో కాదు నేషనల్ క్రష్మికగా పేరొందిన రష్మిక మందాన్న. అయితే అల్లు అర్జున్‌తో పాటు రష్మిక బాలయ్య టాక్ షోలో సందడి చేసింది. బాలకృష్ణ ఆమెను చందమామతో పోల్చి, ఎందుకు ఇంత అందంగా కనిపిస్తున్నారంటూ ఆమె అందాన్ని పొగుడుతూ కన్నడ కవిత్వంతో తెగ పొగిడాడు.

ఇప్పుడు రష్మిక తన క్రష్ అని ఒప్పుకున్నాడు. మరి రష్మిక ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఒక సీనియర్ హీరో నటిని క్రష్ అని పిలవడం చాలా అరుదు. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 107 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 21న ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు.

Exit mobile version